AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ముద్దులొలుకుతోన్న ఈ క్యూట్ చిన్నారిని గుర్తుపట్టారా ?.. కేరళ కుట్టి టాలీవుడ్ హీరోయిన్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‏గా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న కేరళ కుట్టి. బాలనటిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి కథానాయికగానూ సక్సెస్ అయ్యింది. వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపై కూడా అడియన్స్‏ను అలరించింది. ఈ క్యూటీ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.

Tollywood: ముద్దులొలుకుతోన్న ఈ క్యూట్ చిన్నారిని గుర్తుపట్టారా ?.. కేరళ కుట్టి టాలీవుడ్ హీరోయిన్..
Actress
Rajitha Chanti
|

Updated on: Jul 19, 2023 | 5:55 PM

Share

పైన ఫోటోలో కనిపిస్తోన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా ?. టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‏గా ఫాలోయింగ్ సొంతం చేసుకున్న కేరళ కుట్టి. బాలనటిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి కథానాయికగానూ సక్సెస్ అయ్యింది. వెండితెరపైనే కాకుండా.. బుల్లితెరపై కూడా అడియన్స్‏ను అలరించింది. ఈ క్యూటీ పేరు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. న్యాచురల్ స్టార్ నాని, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోస్ సినిమాల్లో నటింటి ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే అందం, అభినయంతో ఆకట్టుకున్నప్పటికీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా ఆఫర్స్ రాలేదు. గుర్తుపట్టారా ?.. తనే హీరోయిన్ నివేదా థామస్. 1995 నవంబర్ 2న కన్నూర్ ప్రాంతంలో జన్మించిన నివేదా.. 2002లో మలయాళం మూవీ ‘ఉత్తర’లో బాలనటిగా తెరంగేట్రం చేసింది.

ఆ తర్వాత సన్ టీవీలో అప్పట్లో ప్రసారమైన మై డియర్ భూతం సీరియల్లో నటించింది. బాలనటిగా అలరించిన ఈ చిన్నది.. మలయాళంలో అనేక చిత్రాల్లో సహాయ నటిగా కనిపించింది. 2016లో న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్మెన్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో నివేద తన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత నిన్ను కోరి, జై లవకుశ, 118, బ్రోచేవారెవరురా, దర్బార్, వి, వకీల్ సాబ్, మీట్ క్యూట్, శాకిని డాకిని చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

తెలుగు, మలయాళంలో కాకుండా.. తమిళంలోనూ పలు సినిమాల్లో నటించింది నివేదా. ఇక ఈ ఏడాది ఎంతడా సాజి అనే మలయాళ మూవీలో కనిపించింది. అలాగే తెలుగులో శాకిని డాకిని చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‏గా ఉంటుంది నివేదా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.