Tollywood: అందంతో మాయ.. కలువ కన్నులతోనే మంత్రముగ్దులను చేస్తుంది.. ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా ?..
అందం, అభినయంతో వెండితెరపై మాయ చేస్తుంది. ఎవరో గుర్తుపట్టగలరా ?.. తెలుగులో చేసింది ఒకటి రెండు చిత్రాలే అయినప్పటికీ ఫాలోయింగ్ మాత్రం భారీగానే సంపాదించుకుంది. అంతేకాదు.. ఇప్పుడు ఈ అమ్మడు వరుసగా హిట్స్ అందుకుంటుంది.

పైన ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్. ఇప్పుడిప్పుడే వరుస అవకాశాలు అందుకుంటూ పాపులారిటీని పెంచుకుంటుంది. అందం, అభినయంతో వెండితెరపై మాయ చేస్తుంది. ఎవరో గుర్తుపట్టగలరా ?.. తెలుగులో చేసింది ఒకటి రెండు చిత్రాలే అయినప్పటికీ ఫాలోయింగ్ మాత్రం భారీగానే సంపాదించుకుంది. అంతేకాదు.. ఇప్పుడు ఈ అమ్మడు వరుసగా హిట్స్ అందుకుంటుంది. తనే హీరోయిన్ మీనాక్షి చౌదరి. 1996 మార్చి 5న హర్యానాలో జన్మించిన మీనాక్షి.. 2018 ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్న రప్ గా నిలిచింది.
అలాగే 2021లో సుశాంత్ నటించిన ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఈ ముద్దుగుమ్మకు ఆశించినంత స్థాయిలో గుర్తింపు రాలేదు. ఇక ఆ తర్వాత మాస్ మాహారాజా రవితేజ నటించిన ఖిలాడి చిత్రంలోనూ కనిపించింది. గతేడాది యంగ్ హీరో అడివి శేష్ నటించిన హిట్ 2 మూవీతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాతో విజయం అందుకోవడమే కాదు.. ఫాలోయింగ్ సైతం పెంచుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా.. ఇప్పుడు తమిళంలోనూ ఆఫర్స్ అందుకుంటుంది.




ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ బంపర్ ఆఫర్ కొట్టేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న గుంటూరు కారం చిత్రంలో ఛాన్స్ వచ్చినట్లుగా టాక్ వినిపిస్తుంది. ముందుగా ఈ సినిమాలో పూజా హెగ్డే, శ్రీలీల నటించాల్సి ఉంది. కానీ పూజా హెగ్డే తప్పుకోవడంతో ఆమె స్థానంలోకి మీనాక్షిని తీసుకున్నట్లుగా సమాచారం. మరీ ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్ వచ్చేవరకు ఆగాల్సిందే.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




