Bholaa Shankar Teaser: హద్దుల్లేవ్ సరిహద్దుల్లేవ్.. ‘భోళా శంకర్’ టీజర్ వచ్చేసింది..
మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రోమో ఆకట్టుకుంది. అలాగే ఇదివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా శనివారం సాయంత్రం భోళా శంకర్ టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం భోళా శంకర్. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ప్రోమో ఆకట్టుకుంది. అలాగే ఇదివరకు రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా శనివారం సాయంత్రం భోళా శంకర్ టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
తాజాగా విడుదలైన టీజర్… ఆధ్యంతం యాక్షన్ కమ్ సిస్టర్ సెంటిమెంట్‌తో సాగుతుంది. అలాగే ఎప్పటిలాగే ఈ సినిమాలో చిరు మార్క్ కామెడీతోపాటు.. మాస్ యాక్షన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. “స్టేట్ డివైడ్ అయినా.. అందరు నావాళ్లే.. ఆల్ ఏరియాస్ అప్నా హై.. నాకు హద్దుల్లేవ్ సరిహద్దుల్లేవ్.. ” అంటూ చిరు చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నారు.
మెహర్ రమేష్ మొదటిసారిగా చిరంజీవితో సినిమా చేస్తున్నారు. దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈసినిమాను బ్లాక్ బస్టర్ హిట్ అందుకునేందుకు భారీగానే ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా నుంచి కొద్ది రోజలుగా చిరు లీక్స్ అంటూ షూటింగ్ ఫోటోస్, వీడియోస్ తన ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తున్నారు చిరు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.




మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




