Tollywood: ఏంటన్నా ఇలా మారిపోయావ్? సిక్స్ ప్యాక్ లుక్‌తో టాలీవుడ్ హీరో సర్‌ప్రైజ్.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ టాలీవుడ్ క్రేజీ హీరో సక్సెస్ చూసి చాలా రోజులైంది. దీనికి తోడు వైవాహిక జీవితంపై బోలెడు రూమర్లు వస్తున్నాయి. అయితే అవన్నీ పట్టించుకోకుండా తన సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నాడీ హ్యాండ్సమ్ హీరో. అయితే ఇప్పుడితను ఏకంగా సిక్స్ ప్యాక్ లుక్ తో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు.

కొందరు హీరోలు తమ సినిమాల కోసం చాలా కష్టపడతారు.ప్రేక్షకులను మెప్పించేందుకు కొత్తగా కనిపించేందుకు తమ శరీరాన్ని ఎంతైనా బాధ పెట్టుకుంటారు. అసరమైతే బరువు పెరుగుతారు. సన్నగా కూడా మారిపోతారు. సిక్స్ ప్యాక్ కూడా ట్రై చేస్తారు. తాజాగా మరో టాలీవుడ్ హీరో తన లుక్ మొత్తం మార్చేశాడు. మరీ బక్కచిక్కిపోయి అసలు గుర్తుపట్టలేకుండా మారిపోయాడు. ప్రస్తుతం ఈ హీరో ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఈ ఫొటోల్లో హీరో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించినా మరీ పీలగా తయారైపోయాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫొటోల్లో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో శర్వానంద్.
శర్వానంద్ హిట్ కొట్టి సుమారు మూడేళ్లవుతోంది. 2002లో వచ్చిన ఒకే ఒక జీవితం సినిమా తర్వాత కేవలం ఒకే సినిమాలో నటించాడు శర్వా. గతేడాది రిలీజైన మనమే సినిమా ఓ మోస్తరుగా ఆడింది. అయితే ప్రస్తుతం ఈ ప్రామిసింగ్ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. నారీ నారీ నడుమ మురారి సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. ఇది కాకుండా బైకర్ అనే ఓ స్పోర్ట్స్ డ్రామాలోనూ నటిస్తున్నాడు శర్వా. అలాగే సంపత్ నంది దర్శకత్వంలో భోగి అనే పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ లోనూ యాక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శర్వా లేటెస్ట్ గా కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో సిక్స్ ప్యాక్ తో కనిపించినా మరీ బక్కచిక్కిపోయి ఉన్నాడు. దీంతో చాలా మంది మొదట అతనని గుర్తు పట్టలేదు. మొత్తానికి శర్వానంద్ సిక్స్ ప్యాక్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
శర్వానంద్ లేటెస్ట్ ఫొటోస్..
Elegance in posture, power in presence. 🖤#Sharwa exudes effortless charm and unshakable confidence in every frame. ❤️🔥 @ImSharwanand #Sharwanand#Biker pic.twitter.com/U0pJtPi3Mx
— Ramesh Bala (@rameshlaus) October 24, 2025
వెంకయ్య నాయుడితో శర్వానంద్..
Today marks the beginning of a dream close to my heart, #OMI 🤍
I feel truly honored and grateful to the Former Vice President of India, Shri @MVenkaiahNaidu Garu, for launching this vision.
OMI is a promise to nurture creativity, sustainability, and human connection. pic.twitter.com/aoRjamGuMz
— Sharwanand (@ImSharwanand) September 9, 2025
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








