AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamta Kulkarni: గ్లామర్ ప్రపంచాన్ని వదిలి.. మమతా కంటే ముందు సన్యాసిని, సాధువులుగా మారిన హీరో, హీరోయిన్లు వీరే

మమతా కులకర్ణి కంటే ముందు చాలా మంది నటీనటులు ఆధ్యాత్మికత వైపు అడుగులు వేశారు. తమ డబ్బు, పేరు, హోదా, కీర్తి ప్రతిష్టలను వదులుకుని సన్యాసిని, సాధువులుగా మారిపోయారు. సినిమా కెరీర్‌లో ఒడిదుడుకుల తర్వాత కొందరు ఈ నిర్ణయం తీసుకుంటే, మరికొందరు కెరీర్ పీక్స్ లో ఉండగానే ఆధ్యాత్మికతను ఎంచుకున్నారు.

Mamta Kulkarni: గ్లామర్ ప్రపంచాన్ని వదిలి.. మమతా కంటే ముందు సన్యాసిని, సాధువులుగా మారిన హీరో, హీరోయిన్లు వీరే
Mamta Kulkarni
Basha Shek
|

Updated on: Feb 01, 2025 | 10:48 AM

Share

సినిమా ఇండస్ట్రీలో పెద్ద స్టార్ అవ్వాలని చాలా మంది కలలు కంటారు. కానీ అందులో కొందరు మాత్రమే విజయం సాధిస్తారు. తమ సొంత కష్టార్జితంతో సినిమా ఇండస్ట్రీలో స్టార్లు గా ఎదిగిన ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు. అదే సమయంలో సినిమా ఇండస్ట్రీలో ఆశించిన విజయాలు అందుకోలేక ఇతర రంగాల వైపు మళ్లిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా డబ్బు, పేరు, మంచి హోదా వచ్చిన తర్వాత కూడా చాలామంది నటీనటులు ఆధ్యాత్మికత వైపు మళ్లారు. అలనాటి హీరోయిన్ మమతా కులకర్ణి ఇటీవల సన్యాసిగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌ రాజ్ లో జరుగుతోన్న మహాకుంభమేళాలో సన్యాసం తీసుకుందీ అందాల తార. అంతేకాదు కిన్నార్ అఖాడా మహా మండలేశ్వరిగా కూడా నియమితురాలైంది. అయితే కొన్ని కారణాలతో మమతను దీని నుంచి తొలగించారు. కాగా మమత కులకర్ణి కంటే ముందు చాలా మంది హీరోలు, హీరోయిన్లు ఇలా ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నారు.

మమత కులకర్ణి..

మమత పలు హిందీ సినిమాల్లో నటించింది. ప్రేమ శిఖరం, దొంగ వంటి తెలుగు సినిమాల్లోనూ తళుక్కుమంది. అదే సమయంలో మ్యాగజైన్‌లలో బోల్డ్ ఫోటోషూట్స్, అండర్‌వరల్డ్‌తో సంబంధాలు, డ్రగ్స్ ఆరోపణలు తదితర కారణాలతో వివాదాల్లో నిలిచిందీ ముద్దుగుమ్మ. చాలా ఏళ్లుగా విదేశాల్లో ఉంటోన్న మమత ఇటీవల మహా కుంభమేళాలో సన్యాసం తీసుకుంది.

సుచిత్రా సేన్

అరవై, డెబ్బైల నాటి హిందీ ప్రముఖ నటి సుచిత్రా సేన్ దాదాపు 25 సంవత్సరాల సినిమా కెరీర్ తర్వాత ఆధ్యాత్మిక బాట పట్టింది. 1978లో సినిమాల కు గుడ్ బై చెప్పేసిన ఆమె దైవ చింతనవైపు అడుగులు వేసింది.

ఇవి కూడా చదవండి

బర్ఖా మదన్

బర్ఖా మదన్ ఒకప్పుడు చాలా పాపులర్ మోడల్, అందాల రాణి, ప్రముఖ నటి కూడా . కానీ ఆమె బౌద్ధ సన్యాసిగా మారడానికి సినిమా ప్రపంచాన్ని విడిచిపెట్టింది. బౌద్ధ సన్యాసి అయిన తర్వాత ఆమె తన పేరును కూడా మార్చుకుంది.

సోఫియా హయత్

ప్రముఖ రియాలిటీ షో స్టార్ సోఫియా హయత్ కూడా గ్లామర్ ప్రపంచాన్ని వదిలి సన్యాసిగా మారింది. దీంతో తన వ్యక్తిత్వంలో చాలా మార్పులు వచ్చాయని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిందామె.

వీరు కూడా..

  • ఇక ‘ఆషికీ’ సినిమాతో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న నటి అను అగర్వాల్ ఆధ్యాత్మికత బాట పట్టడంతో అందరూ షాక్ అయ్యారు. అలాగే నటి అనఘా భోసలే కూడా కొన్నేళ్ల క్రితం నటనా రంగాన్ని విడిచి పెట్టి ఆధ్యాత్మికం వైపు అడుగులు వేసింది.
  • హిందీ సినిమాల్లోని ప్రముఖ నటులు వినోద్ ఖన్నా, నిర్మాత-దర్శకులు మహేష్ భట్, విజయ్ ఆనంద్ ఓషో అంటే ఆచార్య రజనీష్ ఆలోచనలతో బాగా ప్రభావితమయ్యారు.
  • ఇక ప్రముఖ నటుడు ప్రేమ్‌నాథ్ సినిమా కెరీర్ క్షీణించినప్పుడు నిరాశతో సాధువుగా మారిపోయాడు. కొన్నాళ్లుగా గ్లామర్ ప్రపంచానికి దూరంగా ఉన్నాడు. అయితే ఆ తర్వాత ఆశావాహ దృక్పథంతో మళ్లీ సినిమా రంగానికి తిరిగి వచ్చాడు. త ‘బాదల్’, ‘బాబీ’, ‘జానీ మేరా నామ్’, ‘జానీ దుష్మన్’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి