Game Changer Review : గేమ్ ఛేంజర్ రివ్యూ.. రామ్ చరణ్, శంకర్ కాంబో హిట్టు కొట్టిందా..?

త్రిబుల్ ఆర్ లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమా గేమ్ చేంజర్. అలాగే శంకర్ తెరకెక్కించిన మొదటి తెలుగు సినిమా ఇది. అన్నింటికీ మించి 350 కోట్లకు పైగా బడ్జెట్ తో దిల్ రాజు తన బ్యానర్లో 50వ సినిమాగా గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు. మరి వీళ్ళందరి కష్టం ఫలించిందా.. లేదా..? సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Game Changer Review : గేమ్ ఛేంజర్ రివ్యూ.. రామ్ చరణ్, శంకర్ కాంబో హిట్టు కొట్టిందా..?
Game Changer Movie Review
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajitha Chanti

Updated on: Jan 10, 2025 | 7:31 AM

మూవీ రివ్యూ: గేమ్ ఛేంజర్

నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వానీ, అంజలి, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్, జయరామ్, నాజర్ తదితరులు

సినిమాటోగ్రఫీ: తిరు

సంగీతం: తమన్

ఎడిటింగ్: సమీర్ మహమ్మద్ రూబెన్

కథ: కార్తీక్ సుబ్బరాజ్

నిర్మాత: దిల్ రాజు

స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శంకర్

త్రిబుల్ ఆర్ లాంటి మెగా బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చరణ్ నుంచి వచ్చిన సినిమా గేమ్ చేంజర్. అలాగే శంకర్ తెరకెక్కించిన మొదటి తెలుగు సినిమా ఇది. అన్నింటికీ మించి 350 కోట్లకు పైగా బడ్జెట్ తో దిల్ రాజు తన బ్యానర్లో 50వ సినిమాగా గేమ్ చేంజర్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చాడు. మరి వీళ్ళందరి కష్టం ఫలించిందా.. లేదా..? సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

ఐఏఎస్ రామ్ నందన్ (రామ్ చరణ్) స్ట్రిక్ట్ కలెక్టర్. ప్రతిదీ రూల్ ప్రకారం చేస్తుంటాడు. తన పరిధిలో ఏ తప్పు జరిగినా ఒప్పుకోడు. అలాంటి ఐఏఎస్ వైజాగ్ వచ్చిన తర్వాత సిటీని క్లీన్ చేసే పనిలో పడతాడు. అలాంటి వాడికి ముఖ్యమంత్రి సత్యమూర్తి (శ్రీకాంత్) కొడుకు బొబ్బిలి మోపిదేవి (sj సూర్య)తో అనుకోని శత్రుత్వం ఏర్పడుతుంది. తన ప్రతి పనికి అడ్డొస్తున్న ఐఏఎస్ రామ్ నందన్ అడ్డు తొలగించుకోవాలని అనుకుంటాడు మోపిదేవి. అదే సమయంలో సత్యమూర్తి చనిపోతాడు. ఆయన చనిపోతూ తన వారసత్వం ఎవరికి ఇవ్వాలో చెప్తాడు. ఇదే సమయంలో తన తండ్రి అప్పన్న (రామ్ చరణ్) గురించి.. అమ్మ గురించి కొన్ని నిజాలు తెలుసుకుంటాడు రామ్ నందన్. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికలు కూడా వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది.. అసలు రామ్ జీవితంలోకి దీపిక (కియారా అద్వానీ) ఎలా వచ్చింది..? అనేది మిగిలిన కథ

కథనం:

గేమ్ ఛేంజర్ సినిమా గురించి శంకర్ ముందు నుంచి ఒకటే మాట చెబుతున్నాడు. ఇది ఇప్పటి వరకు చూడని కొత్త కథ కాదు.. కానీ స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని..! తెలుగులో చాలా రోజుల తర్వాత వచ్చిన పక్కా పొలిటికల్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్. ఈ సినిమాకు శంకర్ మార్క్ స్క్రీన్ ప్లే అడిషనల్ అట్రాక్షన్. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథకు తనదైన శైలిలో చాలా మెరుగులు దిద్దాడు అని స్క్రీన్ మీద చూస్తే అర్థమవుతుంది. గేమ్ చేంజర్ సినిమాలో మేజర్ హైలైట్ పాటలు, గ్రాండియర్. సినిమా మొదలైన 20 నిమిషాల్లోపే మెయిన్ కథలోకి వెళ్లిపోయాడు శంకర్. ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా తన స్క్రీన్ ప్లే మ్యాజిక్ మొదలు పెట్టాడు. టిపికల్ శంకర్ సినిమాలో కనిపించే సామాజిక దృక్పథం ఉన్న సన్నివేశాలు ఈ సినిమాలో కూడా చాలానే ఉన్నాయి. దానికే కమర్షియల్ అంశాలు జోడించాడు శంకర్. ముఖ్యంగా కాలేజీ స్టూడెంట్ గా రామ్ చరణ్ ఎంట్రీ.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే కథ వేగంగా జరుగుతున్న సమయంలో కియారా అద్వాని, చరణ్ మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తాయి.

ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం నుంచి గేమ్ చేంజర్ స్వరూపం మారిపోయింది. అప్పన్న క్యారెక్టర్ వచ్చిన తర్వాత కథలో మరింత వేగం పుంజుకుంది. ముఖ్యంగా చరణ్, ఎస్ జె సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. తన సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎమోషనల్ గా వర్కౌట్ చేయడం శంకర్ అలవాటు. గేమ్ ఛేంజర్ సినిమాలోనూ ఇదే చేశాడు శంకర్. అప్పన్న ఎపిసోడ్ ఎక్కడ ముగించాలో కరెక్ట్ గా అక్కడ ముగించాడు దర్శకుడు. అప్పన్న పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా బాగానే ఉంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తర్వాత మళ్లీ మెయిన్ స్టోరీలోకి వచ్చేసాడు శంకర్. చరణ్, సూర్య మధ్య వచ్చే టిట్ ఫర్ ట్యాట్ ఎపిసోడ్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. క్లైమాక్స్ ఎందుకో కాస్త వీక్ గా ముగించాడు అనిపించింది.

నటీనటులు:

రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. ఇటు ఐఎఎస్ రామ్ నందన్ గా.. అటు అప్పన్నగా రెండు పాత్రల్లోనూ చాలా బాగా నటించాడు చరణ్. ఎమోషనల్ సన్నివేశాలు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు మెగా వారసుడు. ఇక అంజలి కూడా ఉన్నంత సేపు అద్భుతంగా నటించింది. కియారా అద్వానీ పర్లేదు. ఎస్ జె సూర్య ఈ సినిమాకు మరో ప్రధానమైన బలం. మోపిదేవి పాత్రకు ప్రాణం పోసాడు సూర్య. శ్రీకాంత్, సునీల్, జయరాం, నాజర్ ఇలా సీనియర్ నటులు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

తమన్ గేమ్ చేంజర్ సినిమాకు మంచి సంగీతం అందించాడు. పాటల కంటే బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. తిరు అందించిన సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. శంకర్ ఏదైతే విజువలైజ్ చేసాడో అది స్క్రీన్ మీద కనిపించింది. ఎడిటర్ రూబెన్ వర్క్ బాగుంది. సినిమా నిడివి గురించి ఇంకాస్త ఆలోచించి ఉంటే బాగుండేది. కానీ అక్కడ దర్శకుడు శంకర కాబట్టి డిస్కషన్ కు చోటు ఉండదు. అక్కడికి నానా హైరానా పాటను సినిమా నుంచి తీసేశారు. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన కథ రొటీన్ గానే ఉన్నా.. దానికి శంకర్ అందించిన ట్రీట్మెంట్ మాత్రం బాగుంది. చివరగా నిర్మాత దిల్ రాజు ఖర్చుకు వెనకాడకుండా బడ్జెట్ పెట్టాడు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా గేమ్ ఛేంజర్.. ఇంట్రెస్టింగ్ పొలిటికల్ గేమ్..!

ఇది చదవండి : Tollywood: చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్.. గుర్రపు స్వారీ చేస్తోన్న ఈ హీరోయిన్ ఎవరంటే..

Tollywood: రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. స్టార్ హీరోల కంటే ఎక్కువ ఫాలోయింగ్.. ఎవరో తెలుసా.. ?

Tollywood: అరె ఏంట్రా ఇది.. ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి.. గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.