Balakrishna: మా కిట్టయ్యను వదిలేదేలే.. బాలయ్యను హత్తుకుని బామ్మ మారాం.. నెట్టింట్లో వైరల్ వీడియో
నందమూరి నటసింహం బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మాస్ అభిమానుల్లో బాలయ్యకు భారీ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక సందర్భమేదైనా 'జై బాలయ్య' అంటూ నినాదాలు వినిపించడం పరిపాటిగా మారింది.
నందమూరి నటసింహం బాలకృష్ణకు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా మాస్ అభిమానుల్లో బాలయ్యకు భారీ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక సందర్భమేదైనా ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు వినిపించడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో బుధవారం (మార్చి8) విజయవాడలో బాలయ్య సందడి చేశారు. తన అఖండ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి ఓ నగల దుకాణాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ వస్తున్నారని తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు విజయవాడ బందర్ రోడ్డుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా నందమూరి నటసింహంతో కలిసి ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు. ఈక్రమంలో అక్కడ ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. బాలయ్య మాట్లాడే సమయంలో ఒక వృద్ధురాలు ఆయన దగ్గరకు వచ్చింది. బాలయ్యను దగ్గర నుంచి చూడటమే కాకుండా ఆయన మాట్లాడుతుంటే గట్టిగా పట్టుకుంది. బాలయ్య కూడా ఆవిడ అభిమానం చూసి ఆప్యాయంగా భుజం మీద చేయి వేశారు. భద్రతా సిబ్బంది ఆమెని కిందకు వెళ్లమని కోరారు. అయితే వృద్ధురాలు మాత్రం బాలకృష్ణ ను పట్టుకుని వదలను అన్నట్లు తల ఊపుతూ కాసేపు మారాం చేసింది.
అయితే చివరకు భద్రతా సిబ్బంది బతిమాలడంతో సరే పోనీ అన్నట్లుగా బాలయ్యను వదిలి కిందకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా బాలయ్య అభిమానులు ఈ వీడయోను నెట్టింట్లో షేర్ చేస్తూ హంగామా చేస్తున్నారు. బాలయ్యను ఆ బామ్మను దగ్గరకు తీసుకోవడం, ఆమెపై ఆప్యాయంగా చేయి వేసి మాట్లాడటం చూసి ‘మా బాలయ్య మనసు వెన్న’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
His Fandom has no age limit.?
Heartwarming visuals as God Of Masses #NandamuriBalakrishna garu embraces an elder lady as he addresses fans at the Grand Inauguration of #AndhraPradesh‘s Biggest Jewellery Store #VegaJewellers ?@shreyasgroup @shreyasmedia @brande_the pic.twitter.com/jj2LXN8osK
— Shreyas Sriniwaas (@shreyasmedia) March 8, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం క్లిక్ చేయండి..