Samantha: ‘సమంత ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలుసు.. ఆమె వ్యక్తిత్వానికి ప్రతిరూపం’.. మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు..
తన కూతురితో కలిసి నటించడం ఇదే తొలిసారి అని మంచు లక్ష్మి తెలుపుతూ.. హీరోయిన్ సమంత గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సమంత వ్యక్తిత్వానికి ప్రతిరూపమని.. ఇప్పటివరకు ఆమె ఎన్ని కష్టాలు పడిందో తనకు తెలుసునని చెప్పింది లక్ష్మి.
డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం అగ్ని నక్షత్రం. డైరెక్టర్ వంశీకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను లక్ష్మి నిర్మించగా.. ఈ చిత్రానికి అచ్చు రాజమణి మ్యూజిక్ అందించారు. మార్చి 8న మహిళా దినోత్సవం సందర్భంగా ఈ మూవీ నుంచి తెలుసా.. తెలుసా సాంగ్ స్టార్ హీరోయిన్ సమంత రిలీజ్ చేసారు. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్కు సంబంధించిన పాట కావడంతో మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేశారు. ఇందులో మంచు లక్ష్మి కూతురు నిర్వాణ కూడా నటించింది. తన కూతురితో కలిసి నటించడం ఇదే తొలిసారి అని మంచు లక్ష్మి తెలుపుతూ.. హీరోయిన్ సమంత గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. సమంత వ్యక్తిత్వానికి ప్రతిరూపమని.. ఇప్పటివరకు ఆమె ఎన్ని కష్టాలు పడిందో తనకు తెలుసునని చెప్పింది లక్ష్మి.
సమంతతో తనకున్న అనుబంధం గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ ..”సమంత వ్యక్తిత్వానికి ప్రతిరూపం. ఈ పరిశ్రమలో మహిళలుగా మనం ఏదైనా సొంతంగా చేసుకోవాల్సిందే. ఇప్పటివరకు సమంత ఎన్ని కష్టాలు పడిందో నాకు తెలుసు. ఆమె స్థానంలో మరొకరు ఉంటే నలిగిపోయేవారు. జీవితంలోని క్లిష్ట దశలో కూడా సామ్ తనను తాను మలుచుకున్న తీరు దేశమంతటికీ స్పూర్తినిస్తుంది. నిజంగా సాధికారత పొందిన మహిళా.. మహిళా దినోత్సవం రోజున ఇలాంటి పాటను విడుదల చేయడం మరింత శక్తినిస్తుంది” చెప్పుకొచ్చింది.
ఇక తెలుసా తెలుసా సాంగ్ గురించి సమంత మాట్లాడుతూ.. ఇలాంటి పవర్ ఫుల్ పాటతో వచ్చినందుకు లక్ష్మి అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. చాలా ఇన్ స్పైరింగ్ ఉన్నటువంటి ఈ పాట రోజుల తరబడి మనతోనే ప్రయాణిస్తుంది. విజువల్స్ వండర్ ఫుల్ గా ఉన్నాయి. అర్థవంతమైన పాట వీలైనంత ఎక్కువ మంది మహిళలకు చేరుకోవాలని ఆశిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.