Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌కు షాక్‌.. ఆ స్కామ్‌ కేసులో ఈడీ నోటీసులు జారీ

సీనియర్ నటుడు ప్రకాశ్‌ రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ప్రణబ్ జ్యువెలర్స్ గోల్డ్ పోంజీ స్కీమ్ స్కామ్‌లో విచారణకు హాజరు కావాలని ఆయనకు ఈడీ నోటీసులు పంపింది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ) కింద ప్రకాశ్‌ రాజ్‌కు ఈ నోటీసులు జారీ చేసినట్లు ఈడీ తెలిపింది.

Prakash Raj: ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌కు షాక్‌.. ఆ స్కామ్‌ కేసులో ఈడీ నోటీసులు జారీ
Prakash Raj
Follow us
Basha Shek

|

Updated on: Nov 23, 2023 | 8:07 PM

సీనియర్ నటుడు ప్రకాశ్‌ రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ప్రణబ్ జ్యువెలర్స్ గోల్డ్ పోంజీ స్కీమ్ స్కామ్‌లో విచారణకు హాజరు కావాలని ఆయనకు ఈడీ నోటీసులు పంపింది. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ యాక్ట్‌ (పీఎంఎల్‌ఏ) కింద ప్రకాశ్‌ రాజ్‌కు ఈ నోటీసులు జారీ చేసినట్లు ఈడీ తెలిపింది. ఈ గోల్డ్ పోంజీ పథకం కింద సుమారు రూ.100 కోట్ల మోసం జరిగింది. నటుడు ప్రకాష్ రాజ్ ప్రణబ్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఈనేపథ్యంలోనే ప్రకాష్ రాజ్‌ను విచారించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ED వర్గాల ప్రకారం, తమిళనాడులోని తిరుచ్చికి చెందిన ప్రసిద్ధ ప్రణవ్ జ్యువెలర్స్‌లో PMLA ఆధ్వర్యంలో జరిపిన సెర్చ్ ఆపరేషన్‌లో రూ. 100 కోట్లకు పైగా మోసం జరిగిందని తేలింది. అంతే కాదు ఈడీ సోదాల్లో 11 కిలోల 60 గ్రాముల బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకుంది. దీని తర్వాత, ఈ వ్యవహారంలో విచారణ కోసం నటుడు ప్రకాష్ రాజ్‌కు సమన్లు ​​పంపారు. 10 రోజుల్లోగా అతడు ఈడీ ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది. అతడిని చెన్నైలో విచారించనున్నారు.

తిరుచ్చిలోని ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రణవ్ జ్యువెలర్స్‌పై పీఎంఎల్‌ఏ కింద కేసు నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో పెద్ద ఎత్తున మోసపూరిత ప్రకటనలతో ప్రణవ్ జ్యువెలర్స్‌ పోంజీ స్కీమ్ (గోల్డ్ స్కీమ్)లో సుమారు రూ. 100 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఆరోపించారు. అయితే దీని తర్వాత ప్రణవ్ జ్యువెలర్స్ తమిళనాడులోని షోరూమ్‌లన్నింటినీ రాత్రికి రాత్రే మూసివేసింది. చెన్నై, ఈరోడ్, నాగర్‌కోయిల్, మదురై, కుంభకోణం, పుదుచ్చేరి వంటి నగరాల్లో ప్రణవ్ జ్యువెలర్స్‌కు పెద్ద పెద్ద షోరూమ్‌లు ఉన్నాయి. ఈ గోల్డ్ స్కీమ్‌లో ప్రజలు లక్ష నుండి కోటి రూపాయల వరకు డిపాజిట్లు చేశారు. కాగా ప్రకాష్ రాజ్ ప్రణవ్ జ్యువెలర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అయితే ప్రణవ్ జువెలర్స్ మోసాలపై ఆయన ఇప్పటివరకు స్పందించలేదు. గోల్డ్ స్కీమ్ ద్వారా ప్రజల నుంచి సేకరించిన రూ.100 కోట్లను ప్రణవ్ జ్యువెలర్స్ షెల్ కంపెనీల ద్వారా పెట్టుబడి పెట్టగా, ఈడీ చేతికి చిక్కినట్లు సమాచారం. దీని ప్రకారం, ప్రణవ్ జ్యువెలర్స్, దాని అనుబంధ వ్యక్తులు మోసపూరితంగా పొందిన డబ్బును మరొక షెల్ కంపెనీకి మళ్లించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలోనే బుధవారం ప్రణవ్ జ్యువెలర్స్ షోరూమ్స్‌పై దాడులు జరిగాయి.

ఇవి కూడా చదవండి

10 రోజుల్లోపు విచారణకు హాజరు కావాలి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..