Jana Sena: ఆపరేషన్ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్! నియోజకవర్గాల ఇన్‌చార్జీలపై కసరత్తు
ఆపరేషన్ 1.0లో ఏపీలో పాగా వేసింది జనసేన. అధికార కూటమిలో TDP తర్వాత ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇక ఆపరేషన్ 2.0లో తెలంగాణపై పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారా? దీనికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిందా? దీనిలో భాగంగానే తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తామని జనసేన ప్రకటించిందా?

మాకో పక్కా లెక్కుంది.. దానికో రూటుంది అంటోంది జనసేన. తెలంగాణపై జనసేన ఫోకస్ పెంచింది. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జీల నియామకాలపై కసరత్తు చేస్తోంది. సైలెంట్‌గా గ్రౌండ్ లెవెల్‌లో జనసేన కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. తెలంగాణలో బలం పెంచుకుని, రాబోయే మున్సిపల్, GHMC ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన అడుగులు వేస్తోంది. 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని ప్రణాళికలు వేస్తోంది.
కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో జనసేనలోకి చేరికలు ఊపందుకున్నాయి. మల్కాజ్‌గిరి నుంచి డాక్టర్ వేణు ప్రసాద్ జనసేనలో చేరారు. తెలంగాణ జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నటుడు ఆర్కే సాగర్‌తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.
పొత్తు ఉన్నా లేకున్నా.. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసుడే అంటూ కుండబద్దలు కొట్టారు జనసేన జనరల్ సెక్రటరీ తాళ్లూరి రామ్. తెలంగాణలో పార్టీని నమ్ముకున్నవారికి పోటీ చేసే అవకాశం ఇస్తామన్నారు. అయితే ఏపీలో కూటమి పార్టనర్ అయిన బీజేపీ మాత్రం…తెలంగాణలో తాము సింగిల్‌గా పోటీ చేస్తామంటోంది. జనసేనతో పొత్తు అవసరం లేదని, పార్టీ హైకమాండ్‌కు కూడా ఇదే విషయం చెబుతామన్నారు టీ బీజేపీ చీఫ్ రాంచదర్‌రావు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
