Kayadu Lohar: నైట్ పార్టీ కోసం రూ.35 లక్షలు.. అడ్డంగా దొరికిన డ్రాగన్ బ్యూటీ కాయదు లోహర్
కాయదు లోహర్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆమె 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పూణేలో నివసిస్తోంది. కాయదు 2021లో టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన పోటీలో విజేతగా నిలిచింది. ఆమె 2021లో కన్నడ చిత్రం ముగిల్‌పేటతో నటనా రంగంలోకి అడుగుపెట్టింది.

కాయదు లోహర్.. డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. కాయదు లోహర్.. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఈ చిన్నది మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆమె 2000 ఏప్రిల్ 11న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పూణేలో నివసిస్తోంది. గతంలో కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఈ చిన్నది రీసెంట్ గా వచ్చిన డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కాయదు లోహర్ ఊహించని చిక్కుల్లో పడింది. కాయదు లోహర్ వివాదంలో చిక్కుకుంది. టాస్మాక్ స్కామ్ తో సంబంధం ఉన్న నిందితులు నిర్వహించిన నైట్ పార్టీలో ఈ భామ పాల్గొన్నట్లు తెలిసింది. దాంతో ఈ న్యూస్ కోలీవుడ్ లో తెగ వైరల్ అవుతుంది.
కాయదు లోహర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు ఇప్పుడు కోలీవుడ్ లో తెగ వైరల్ అవుతున్నాయి. తమిళనాడు రాష్ట్ర మద్యం సంస్థ (TASMAC) స్కామ్‌తో సంబంధం కలిగి ఉన్నాయని సమాచారం. ED దాడుల సమయంలో కాయదు లోహర్ ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులతో సన్నిహితంగా ఉన్నట్లు తేలింది. అంతే కాదు ఈ బ్యూటీ స్కామ్‌తో సంబంధం ఉన్న వ్యక్తులు నిర్వహించిన నైట్ పార్టీలకు హాజరైందని కూడా వెలుగులోకి వచ్చింది. అంతే కాదు ఒక్కో పార్టీకి కాయదు సుమారు రూ. 35 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయం ఈడీ అధికారుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు సోషల్ మీడియా పోస్ట్‌లు వార్తలు వినిపిస్తున్నాయి.
కోలీవుడ్‌లోనూ దీని పై పెద్దెత్తున చర్చ జరుగుతుంది. అయితే, ఈ ఆరోపణలు పై ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం ఈడీ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. త్వరలోనే దీనిపై పూరి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాగా ఇప్పుడిప్పుడే క్రేజ్ తెచ్చుకుంటున్న కాయదు కెరీర్ పై ఈ ఆరోపణలు ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. 2022లో విడుదలైన పాథోన్‌పథం నూట్టండుచిత్రం మలయాళంలో కాయదు మొదటి సినిమా. ఇది తెలుగులో పులి: ది నైంటీంత్ సెంచరీ పేరుతో 2023లో విడుదలైంది. 2022లో అల్లూరి చిత్రంలో శ్రీ విష్ణు సరసన నటించింది, కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. డ్రాగన్ హిట్ అయిన తర్వాత ఇప్పుడు వరుస ఆఫర్స్ అందుకుంటుంది ఈ చిన్నది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి




