AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్యాడ్ లాక్ అంటే ఈ హీరోయిన్‌దే.. అట్టర్ ఫ్లాప్ సినిమా కోసం.. రూ.700కోట్ల బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకుంది..

సినిమా ఇండస్ట్రీ మంచి అవకాశం వస్తే తమ నటనతో ప్రేక్షకులను విశేషమా ఆకట్టుకుంటుంటారు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమా ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోరు. కానీ ఓ ముద్దుగుమ్మ మాత్రం .. ఓ అట్టర్ ఫ్లాప్ సినిమా కోసం ఏకంగా 700కోట్ల బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకుంది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

బ్యాడ్ లాక్ అంటే ఈ హీరోయిన్‌దే.. అట్టర్ ఫ్లాప్ సినిమా కోసం.. రూ.700కోట్ల బ్లాక్ బస్టర్ సినిమాను వదులుకుంది..
Chhaava
Rajeev Rayala
|

Updated on: May 22, 2025 | 10:45 AM

Share

హీరోయిన్స్ స్టార్ డమ్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ.. క్రేజ్ తెచ్చుకుంటున్నారు. ఇప్పుడున్న యంగ్ బ్యూటీ ఒకటి రెండు సినిమాలతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాగే ఒక్క సినిమా హిట్ అయితే చాలు బ్యాక్ టు బ్యాక్ వరుసగా అరడజను సినిమాలను లైనప్ చేస్తున్నారు. యంగ్ హీరోల సినిమాల్లో నటిస్తూ ఆ తర్వాత పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్‌లు అందుకుంటున్నారు. కుర్ర హీరోయిన్స్ జోరుకు కొంతమంది సీనియర్ హీరోయిన్స్ వెనకబడుతున్నారు. ఆఫర్స్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే అవకాశాల రావడమే కష్టంగా మారిన సమయంలో ఓ హీరోయిన్ క్రేజీ ఆఫర్ ను మిస్ చేసుకుంది. ఓ డిజాస్టర్ సినిమా కోసం ఏకంగా రూ. 700కోట్ల సినిమాను వదులుకుంది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? డేట్స్ అడ్జెస్ట్ అవ్వక చాలా మంది హీరోయిన్ కొన్ని భారీ హిట్ సినిమాలను వదులుకుంటూ ఉంటారు.

అలాగే ఇప్పుడు ఓ డిజాస్టర్ సినిమా కోసం ఏకంగా భారీ బడ్జెట్ సినిమాను మిస్ చేసుకుంది ఓ వయ్యారి. ఆమె ఎవరో కాదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్. ఈముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. నేను శైలజ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ చిన్నది ఆతర్వాత మహానటి సినిమాతో పాపులర్ య్యింది. ఈ సినిమాకు ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది.

ఇక కీర్తి ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.. అయితే రీసెంట్ గా బాలీవుడ్ లోనూ సినిమా చేసింది కీర్తి. బేబీ జాన్ అనే సినిమాతో అక్కడ పరిచయం అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమా కోసం కీర్తి ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుందని తెలుస్తుంది. బాలీవుడ్ లో ఇటీవల ఛావా సినిమా విడుదలై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. విక్కీ కౌశల్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దేహవ్యాప్తంగా ఛావా సినిమా రూ. 700కోట్లకు పైగా వసూల్ చేసింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా చేసింది. అయితే ముందుగా హీరోయిన్ పాత్ర కోసం కీర్తిసురేష్ ను సంప్రదించారట. అయితే ఆ సమయంలో బేబీ జాన్ సినిమాతో బిజీగా ఉండటంతో ఆమె నో చెప్పిందని తెలుస్తుంది. ప్రస్తుతం కీర్తిసురేష్ సినిమాల స్పీడ్ తగ్గించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

Follow Us