AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్, సందీప్ రెడ్డి సినిమా నుంచి తప్పుకున్న దీపికా.. కారణం ఇదేనట

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నాయి. బాహుబలికి ముందు ఏడాదికి ఒక సినిమా అనే నిబంధన ఉండేది ప్రభాస్కి. ఈ విషయం ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే తెలుస్తుంది. దీంతో ప్రభాస్ ఏడాదికి ఒకే సినిమాలో నటించేవాడు. అయితే ఇప్పుడు డిమాండ్ పెరగడంతో ప్రభాస్ ఆ రూల్ ని బ్రేక్ చేసి ఏడాదికి రెండు మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.

Prabhas: ప్రభాస్, సందీప్ రెడ్డి సినిమా నుంచి తప్పుకున్న దీపికా.. కారణం ఇదేనట
Prabhas
Rajeev Rayala
|

Updated on: May 22, 2025 | 11:49 AM

Share

టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా విపరీతంగా క్రేజ్ తెచ్చుకున్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు సందీప్ రెడ్డి. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు.. ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో ఇదే సినిమాను రీమేక్ చేసి అక్కడ కూడా భారీ హిట్ కొట్టాడు సందీప్ రెడ్డి. ఇక యానిమల్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రణబీర్ కపూర్, రష్మిక మందన్న కలిసి నటించిన యానిమల్ సంచలన విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ప్రభాస్ తో సినిమా కోసం రెడీ అవుతున్నాడు సందీప్. ఇప్పటికే ఈ సినిమా పనులు కూడా మొదలు పెట్టేశాడు.

ఈ సినిమాకు స్పిరిట్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో  నటిస్తున్నాడని టాక్. ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ పనులు కూడా మొదలు పెట్టాశాడట సందీప్ రెడ్డి వంగ. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనెను ఎంపిక చేశారని టాక్ వినిపిస్తుంది. అంతే కాదు ఈ సినిమా కోసం దీపికా ఏకంగా రూ. 20కోట్ల వరకు  రెమ్యునరేషన్ అందుకుంటుందని టాక్ కూడా వినిపించింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి దీపికా తప్పుకుందని టాక్ వినిపిస్తుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న దీపికా ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన దీపికా ప్రస్తుతం ఆ బిడ్డ లాలన చూసుకుంటుంది. త్వరలోనే ఈ చిన్నది తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని చూస్తుంది. ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ లో ఛాన్స్ దక్కిందట.. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ రావడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి దీపికా తప్పుకుందని తెలుస్తుంది. దాంతో ఇప్పుడు మరో హీరోయిన్ ను వెతికే పనిలో పడ్డాడట సందీప్ రెడ్డి. గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాను కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నాడు సందీప్ రెడ్డి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత