Samantha Ruth Prabhu: సమంత అందుకోసమే ఆ హీరోలను పొగుడుతుందా..?
ఎట్ ప్రజెంట్ ఫిల్మ్ ఫీల్డ్‌లో ఉన్న హీరోయిన్లందరిలో సమంతనే టాప్. క్రేజ్‌లోనూ.. ఇమేజ్‌లోనూ.. రెమ్యూనరేషన్‌లోనూ.. చివరాఖరికి బోల్డ్ అండ్ వెర్సటైల్ స్టోరీలను పిక్ చేసుకోవడంలోనూ.. ఈమనే తోప్.

ఎట్ ప్రజెంట్ ఫిల్మ్ ఫీల్డ్‌లో ఉన్న హీరోయిన్లందరిలో సమంత(Samantha Ruth Prabhu)నే టాప్. క్రేజ్‌లోనూ.. ఇమేజ్‌లోనూ.. రెమ్యూనరేషన్‌లోనూ.. చివరాఖరికి బోల్డ్ అండ్ వెర్సటైల్ స్టోరీలను పిక్ చేసుకోవడంలోనూ.. ఈమనే తోప్. అందుకే బాలీవుడ్ మేకర్స్ కూడా.. ఇప్పుడు ఈ అమ్మాయితోనే సినిమాలు, వెబ్ సిరీసులు తీసేందుకు ముందుకు వస్తున్నారు. తన వెంట పడుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ హీరోలకు బటర్ పూసే ప్రోగ్రాం మొదలెట్టారు సామ్. మొదలెట్టడమే కాదు.. రీసెంట్ ఓ ఫేమస్ టాక్ షోలో బాలీవుడ్ హీరోలను భలే భలే గా పొగిడేశారు.
బాలీవుడ్ నయా స్టార్ రణ్‌వీర్ సింగ్ అంటే.. తనుకు విపరీతంగా ఇష్టమంటూ… ఓపెన్ అయ్యారు. తన లైఫ్ స్టైల్‌కు… యాటిట్యూడ్‌కు ఫ్యాన్ అని కాస్త గట్టిగా చెప్పారు. చెప్పడమే కాదు.. ఐయామ్ కంప్లీట్‌లీ రణ్వీరీఫై అంటూ ఓ కొత్త వర్డ్‌నే కనిపెట్టారు సామ్. బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. దాంతో పాటు.. బాలీవుడ్ సీనియన్ స్టార్ హీరో.. ఇయర్లీ ఎక్కువ సినిమాలు చేసే అక్కీ పై క్రేజీ కామెంట్స్ చేసి.. ఆయన తో సినిమాలు చేసే మేకర్స్ మైండ్ లో పడిపోయారు. అయితే ఈ ఇద్దరి హీరోలను సామ్ ఆకాశానికెత్తడం చాలా ట్రికీ థింక్ అంటున్నారు కొంత మంది నెటిజన్లు. బాలీవుడ్లో చాన్స్‌ల కోసమేగా.. హీరోలను జోకడాలు అంటూ కామెంట్స్ రూపంలో సామ్ గుట్టు రట్టు చేస్తున్నారు.




