Sravana Bhargavi : వెనక్కి తగ్గిన శ్రావణ భార్గవి.. వివాదాస్పద వీడియో తొలగింపు
ఒకపరి సంకీర్తన వీడియోను తొలగించారు సింగర్ శ్రవణభార్గవి. అన్నమాచార్య కీర్తనపై వివాదం చెలరేగడంతో ఆ వీడియోని డిలీట్ చేశారు. యూట్యూబ్‌తోపాటు.. అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి ఆ కంటెంట్‌ని తొలగిస్తున్నట్లు ఇన్‌స్టాలో ప్రకటించారు శ్రవణభార్గవి.

ఒకపరి సంకీర్తన వీడియోను తొలగించారు సింగర్ శ్రవణభార్గవి(Sravana Bhargavi ). అన్నమాచార్య కీర్తనపై వివాదం చెలరేగడంతో ఆ వీడియోని డిలీట్ చేశారు. యూట్యూబ్‌తోపాటు.. అన్ని ప్లాట్‌ఫామ్స్ నుంచి ఆ కంటెంట్‌ని తొలగిస్తున్నట్లు ఇన్‌స్టాలో ప్రకటించారు శ్రవణభార్గవి. కాని ఆడియోని మార్చి తన సొంత పాటతో వీడియోని మళ్లీ రిలీజ్ చేస్తానని ప్రకటించారు. కొన్నిరోజులుగా ఒకపరి సంకీర్తన వీడియోపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అన్నమయ్య భక్తి పాటను అశ్లీలంగా చిత్రీకరించారంటూ భక్తులు మండిపడ్డారు. శ్రావణ భార్గవి సాంగ్ సహా పలు సినిమాల్లోని అన్నమాచార్య సాంగ్స్ పై చట్టపరమైన చర్యలకు అన్నమయ్య వంశీకులు సిద్ధమయ్యారు. అన్నమయ్య సంకీర్తనలను సినిమాల్లో అసభ్యకరంగా చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని అన్నమయ్య వంశీకులు టిటిడి కి విజ్ఞప్తి చేశారు.. గతంలో అన్నమయ్య సంకీర్తనలు సినిమాల్లో అసభ్యంగా చూపలేదని తెలిపారు.
అయితే ఇప్పుడే అన్నమయ్య కీర్తనలను శృంగార భరితంగా చూపుతున్నారంటూ.. అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య ను సినిమా రచయిత గా చూడవద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు తాళ్ళపాక అన్నమాచార్య వారసులు.అన్నమాచార్య కుటుంబ సభ్యుల అభ్యంతరం.. అన్నమయ్య అభిమానుల నుంచి వ్యతిరేకత రావడంతో శ్రావణభార్గవి వెనక్కి తగ్గారు. సోషల్ మీడియాలో విమర్శలు.. వరుస కాల్స్ రావడంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే ప్రస్తుతానికి వీడియోని డిలీట్ చేసి… తర్వాత వేరే ఆడియోతో అప్‌లోడ్ చేస్తామని ప్రకటించారు శ్రావణభార్గవి.








