Arjun Sarja: హీరో అర్జున్ ఇంట తీవ్ర విషాదం.. అనారోగ్యంతో తల్లి లక్ష్మీ దేవమ్మ మృతి..
గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న దేవమ్మ.. బెంగుళూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Arjun
కన్నడ స్టార్ హీరో అర్జున్ సర్జా (Arjun Sarja) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీ దేవమ్మ ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న దేవమ్మ.. బెంగుళూరులోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం ఆమె పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తల్లి మృతితో అర్జున్ ఇంట విషాదఛాయలు అలుముకున్నాయి.
దేవమ్మ మైసూర్ లో స్కూల్ టీచర్ గా పనిచేసింది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆమె పార్థీవ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్ లో ఉన్నట్లు సమాచారం. దేవమ్మ మృతి పట్ల కన్నడ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Arjun Sarja
ఇవి కూడా చదవండి

Mahesh Babu: సీతూ పాప తీసిన మహేష్ ఫోటో.. ఛార్మింగ్ లుక్‌లో అదిరిపోయిన సూపర్ స్టార్..

Allu Sneha Reddy: ఫాలోవర్లతో ముచ్చటించిన అల్లు అర్జున్ సతీమణి.. గ్యాలరీలో ఇష్టమైన ఫోటో అదేనట..

Samantha: రామ్ చరణ్‌కు ఆసక్తికర ట్యాగ్ ఇచ్చిన సమంత.. ధనుష్, అల్లు అర్జున్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Suriya: సోషల్ మీడియాలో సూర్య స్పెషల్ నోట్.. ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ..