Sivakarthikeyan: హీరో శివకార్తికేయన్ కూతురిని చూశారా.. ? అచ్చం తల్లిలాగే.. ఫోటోస్ వైరల్..
ఎలాంటి ఫిల్మ్ బ్యాగ్రౌండ్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి హీరోగా సక్సెస్ అయ్యారు శివకార్తికేయన్. యాంకర్ గా బుల్లితెరపై సినీప్రయాణం స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ది టాప్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.

కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. యాంకర్ గా బుల్లితెరపై సినీ ప్రయాణం స్టార్ట్ చేసి ఇప్పుడు హీరోగా సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. హీరోయిజం సినిమాలు కాకుండా విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరించాడు. ఇటీవలే అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కెరీర్ తొలినాళ్లల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన శివకార్తికేయన్.. ఆ తర్వాత మెరీనా అనే సినిమాతో హీరోగా మారాడు. మొదటి చిత్రంతోనే నటుడిగా ప్రశంసలు అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయారు. ఇటీవలే మేజర్ ముకుంద్ జీవితకథతో తెరకెక్కిన అమరన్ సినిమాతో సక్సెస్ అందుకున్నారు. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఈ మూవీతో శివకార్తికేయన్, సాయి పల్లవి సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు.
కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ హీరోకు మంచి ఫాలోయింగ్ ఉంది. రెమో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శివకార్తికేయన్ ఆ తర్వాత తన సినిమాలను తెలుగులోకి డబ్ చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈహీరోకు మంచి ఫాలోయింగ్ వచ్చింది. శివకార్తికేయన్ 2010లో తన బంధువు ఆర్తీని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి పాప, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. అయితే శివకార్తికేయన్ కూతురు సైతం సినీప్రియులకు సుపరిచితమే. ఇప్పటికే సింగర్ గా అడియన్స్ హృదయాలు గెలుచుకుంది.
చిన్నతనంలోనే తన తండ్రితో కలిసి ఆ సాంగ్ పాడింది ఆరాధన. కౌసల్య కృష్ణమూర్తి సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన శివకార్తికేయన్.. ఈ మూవీలోని ఓ పాటను తన తండ్రితో కలిసి పాడింది. అప్పట్లో ఆ సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. తమిళంతోపాటు తెలుగులోనూ ఆ సాంగ్ ఆరాధన పాడడం విశేషం. చిన్నప్పుడు తనదైన గాత్రంతో మెస్మరైజ్ చేసిన ఆరాధన.. ఇప్పుడు ఎంతో చక్కగా ఉంది. తాజాగా ఈ చిన్నారి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఆరాధన అచ్చం అమ్మలానే ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..




