టాటూ వేయించుకున్న సురేఖా వాణి.. విషయం తెలియకుండా తప్పుబడుతున్న నెటిజన్స్
వందలాది సినిమాల్లో సహాయక నటిగా మెప్పించింది సురేఖ వాణి. స్టార్ హీరోలు, హీరోయిన్లకు అక్కగా, వదినగా, అమ్మ పాత్రల్లో అద్భుతంగా నటించింది. అయితే గతంలోలా ఇప్పుడు సినిమాల్లో పెద్దగా కనిపించని ఈమె సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువగా కనిపిస్తోంది. తన వీడియోలతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ క్రమంలోనే సురేఖ వాణి మరో వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఈమె పచ్చ బొట్టు పొడిపించుకుంటూ కనిపించడం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఆమె ఏ టాటూ వేయించుకుంటున్నారో తెలియక కొంత మంది ట్రోల్ చేయడం కూడా నెట్టింట కనిపిస్తోంది. సురేఖ వాణి.. వెంకటేశ్వర స్వామి భక్తురాలు. వీలు దొరికినప్పుడల్లా ఏడుకొండలెక్కి తన ఆ స్వామి వారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తన భక్తిని చాటుకునేందుకు ఆమె.. తనకు ఇష్టమైన వెంకన్న పాదరక్షలను టాటుగా వేయించుకుంది. అయితే ఇది తెలియని కొంత మంది నెటిజన్లు రక రకాల కామెంట్స్‌తో ఈ సీరియన్ నటిని ట్రోల్ చేస్తున్నారు. విషయం తెలియకుండా.. వీడియో చూడకుండా ఈమెను విమర్శిస్తున్నారు. ఇక ఈ విషయం పక్కకు పెడితే… మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో సురేఖా వాణి నటించిందంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు దీనిపై క్లారిటీ రాలేదు. దీనిపై మరింత స్పష్టత రావాలంటే జూన్ 27న కన్నప్ప సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలీవుడ్ రామాయణలో శూర్పణఖగా టాలీవుడ్ స్టార్ హీరోయన్ ??
ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా..?
కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్
సూది అవసరం లేకుండా రక్త పరీక్షలు.. AIతో టెస్టులు రిపోర్టులు..
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్ చేసిన డ్రైవర్ షాక
ఖతర్నాక్ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..

