Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్

Phani CH
|

Updated on: Jun 16, 2025 | 8:32 PM

Share

అటవీ ప్రాంతాల్లో ఉండాల్సిన కోతులు.. ఈ మధ్య జనావాసాల్లో విచ్చల విడిగా సంచరిస్తున్నాయి. తెలంగాణ పల్లెల్లో అయితే ఎక్కడ చూసిన వానరమూకలే దర్శనమిస్తున్నాయి. గుంపులు గుంపులుగా గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అధ్యాత్మిక ప్రాంతాల్లో భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. వాటిని తరిమేందుకు ప్రయత్నించిన వారిపై దాడులకు తెగబడుతున్నాయి.

చాలా గ్రామాలు కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నాయి. అయితే, కోతుల బెడదకు చెక్ పెట్టేందుకు కొండముచ్చులను రంగంలోకి దింపారు. కొండముచ్చు కనబడుతే చాలు.. కోతులు పరుగులు తీస్తున్నాయి. ఇప్పుడు కొండముచ్చులు.. స్థానికులతో మంచి స్నేహితులుగా మారిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా గ్రామాల్లో కోతుల బెడద ఉంది. గ్రానైట్ తవ్వకాల కారణంగా.. కోతులన్నీ గ్రామాల్లోకి వస్తున్నాయి. ఆటవీ సంపద కూడా అంతరించిపోతుంది. దీంతో ఆహారం కోసం గ్రామాల మీద పడుతున్నాయి. స్థానికుల జనాభా కంటే, కోతుల జనాభానే అధికంగా ఉంది. తిండి కోసం జనం పై దాడి చేస్తున్నాయి. అన్ని రకాల పంటలను ధ్వంసం చేస్తున్నాయి. పంటలు వేసుకుందామంటే.. రైతులు భయపడుతున్నారు. అయితే ముల్లును ముల్లుతోనే తీయాలనే.. సామెత ప్రకారం.. కోతులకు చెక్ పెట్టేందుకు కొండముచ్చులను రంగంలోకి దింపారు. సహజంగానే కొండముచ్చులకు కోతులకు పడదు. కొండముచ్చును చూడగానే.. కోతులు పరుగులు తీస్తున్నాయి. కొండముచ్చులను 40 వేల రూపాయలకు పైగా కొనుగోలు చేసి, గ్రామంలో తిప్పుతున్నారు. ఇందుకోసం ఏకంగా ఓ గ్రామ సిబ్బందిని ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఆవరణలో కొండముచ్చుకు షెల్టర్ ఇచ్చి, ఆహారం పెడుతున్నారు. తిమ్మాపూర్ మండలం కేంద్రంలో కొండముచ్చులను గ్రామంలో తిప్పుతున్నారు. ఇక్కడ కొండముచ్చు రాగానే.. కోతులు భయంతో పరుగులు తీస్తున్నాయి. దీంతో స్థానికులతో కొండముచ్చులు ఓ ఫ్రెండ్ లా మారిపోయాయి. అందరితో చనువుగా ఉంటున్నాయి. స్థానికులతో ఆడుకుంటున్నాయి. అంతేకాదు.. బైక్‌పై దర్జాగా కూర్చుంటూ చక్కర్లు కొడుతున్నాయి. బైక్‌పై తిరుగుతూ.. నేను ఉన్నాను అంటూ.. కోతులకు హెచ్చరిక చేస్తున్నాయి. ప్రతి రోజు ఉదయం రెండు గంటలు.. సాయంత్రం రెండు గంటలు ఊరు మొత్తం.. కొండముచ్చును తిప్పుతున్నారు గ్రామ పంచాయతీ సిబ్బంది. పంట పొలాల దగ్గరికి కూడా తీసుకెళ్తున్నారు. కొండముచ్చుల కారణంగా చాలా గ్రామాల్లో కోతుల బెడద తగ్గింది. దీంతో కొండముచ్చును తమ గ్రామ జంతువుగానే చూస్తున్నారు. గ్రామస్తులు వివిధ పండ్లు అందిస్తున్నారు. కొండముచ్చును ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు స్థానికులు. మొత్తానికి కొండముచ్చుల భయానికి కోతులు పరుగులు తీస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సూది అవసరం లేకుండా రక్త పరీక్షలు.. AIతో టెస్టులు రిపోర్టులు..