ఒకే గుంతలో పులి, కుక్క.. తర్వాత ఏం జరిగిందంటే..
కేరళలోని మయిలాదుంపరైలో ఓ అరుదైన ఘటన జరిగింది. ఒకే గుంతలో జాతి వైరం ఉన్న రెండు జంతువులు చిక్కుకున్నాయి. ఆదివారం ఓ పులి కుక్కను వెంబడిస్తూ వచ్చింది. ఆ రెండూ తొమ్మిది అడుగుల లోతైన ఒకే గుంతలో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని రెండు జంతువులను సురక్షితంగా బయటకుతీశారు.
ఈ ఘటనలో రెండు జంతువులకు ఎలాంటి హాని కలగలేదు. పులి ఆరోగ్యంగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత దానిని పెరియార్ అభయారణ్యంలో విడిచిపెట్టారు. గుంతలో ఉన్నప్పుడు అవి రెండు దగ్గరగా ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అసలేం జరిగిదంటే.. మయిలాడుమ్పారై వద్ద ఓ ప్రైవేట్ రబ్బరు తోటలో ఆదివారం తెల్లవారుఝామున ఒక పులి, ఒక కుక్క తొమ్మిది అడుగుల లోతైన గుంతలో పడిపోయాయి. పులి కుక్కను తరుముతూ రావడంతో గమనించకుండా గుంతలోకి దూకినట్లుగా అటవీశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ గుంతను తోట యజమాని సన్నీ భద్రత నిమిత్తం తవ్వించాడు. ఉదయం కుక్క భయంగా మొరిగిన శబ్దం విని ఆయన అక్కడకు వెళ్లి చూడగా గుంతలో పులి ఉన్నట్టుగా గుర్తించి వెంటనే అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. అటవీ అధికారులు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. పులికి మత్తు ఇంజెక్షన్ వేసినప్పుడు కుక్క భయంతో ఎగబాకి మొరిగింది. పులి నిద్రలోకి జారుకోవడంతో, కుక్కకు కూడా మత్తు మందు ఇచ్చారు. పులి, కుక్క రెండు మత్తులోకి జారుకున్న తర్వాత వల ఉపయోగించి బయటకు తీసారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తేలియాడుతూ ఎదురొచ్చినవి చూసి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడింది చూసి అంతా షాక్
సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లిన జంట.. రాత్రికి రాత్రే
విధి లిఖితం అంటే ఇదే కావచ్చు! ఒక్క రోజు తేడాతో ఈ స్టార్ హీరోల ఇళ్లలో తీవ్ర విషాదం
కనిపించింది కొద్దిసేపే అయినా.. కుర్రాళ్లను కనికట్టు చేసిందిగా..

సర్కారు ఆఫీసుకు దిష్టి.. పోవటానికి ఏం చేసారో తెలుసా

చోరీకి వెళ్లిన ఇంట్లోనే 3 రోజులు మకాం వేసిన దొంగ.. ఆ తర్వాత

బటర్ నాన్ ఆర్డర్ చేశాడు.. సరిగ్గా తినే టైంకి..

ఆకాశంలో ఉండగా విమానంలో వింత శబ్దాలు.. ఇదేం ఖర్మ రా నాయన..!

ప్రియురాలి కరివేపాకు కోరిక.. దేశాలు దాటి వచ్చిన ప్రియుడు

ఫ్రిజ్లో వింత సౌండ్స్.. వెళ్లి చూడగా గుండె గుభేల్

వాట్ ఏ టెక్నలాజియా.. బంతి లోయలో పడకుండా కుర్రాళ్ల జబర్దస్త్ ఐడియా
