కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
మహబూబాబాద్ జిల్లాలో ఓ కొత్తజంటకు ఊహించని విధంగా జాక్ పాట్ తగిలింది.. ప్రధానమంత్రిని పెళ్లికి రావాలని లేఖ పంపిన ఆ జంటకు ఊహించని కానుక అందింది. ఏకంగా ప్రధాన మంత్రి సంతకంతో వారికి శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ అందింది. దీంతో ఆ జంట ఆనందం తో ఉప్పొంగిపోయింది. ప్రధాని మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. మోదీ నిర్ణయాలు సామాన్యుల ఊహలకు అందవు. దేశ రక్షణలోనైనా, ప్రజా పరిపాలనలోనైనా ఆయన రూటే సెపరేట్.
తాజాగా మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రానికి చెందిన నూతన వధూవరులకు వివాహ శుభాకాంక్షలు తెలుపుతూ, కొత్త జంటను ఆశీర్వదిస్తూ..ప్రధాని సంతకంతో లేఖ వచ్చింది. దీన్ని చూసిన నూతన జంట, ఇరు కుటుంబాల సభ్యుల ఆనందానికి అవధులు లేవు. బయ్యారం మండల కేంద్రానికి చెందిన శివకుమార్ వివాహం మే 23వ తేదీన జరిగింది. ఈ వివాహానికి రావాల్సిందిగా ప్రధాని మోదీకి లేఖ రాశాడు. దీనికి బదులుగా శనివారం రోజున పీఎం ఆఫీస్ నుండి నూతన జంటను దీవిస్తూ మీరు నిండా నురేళ్లు కలిసి మెలిసి ఉండాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నానని ఆశీర్వదిస్తూ మోదీ పేరుతో లేఖ పంపారు. ప్రధాని రిప్లై చూసిన కొత్తజంట ఆనందంలో మునిగి తేలింది. సామాన్యుడి పట్ల మోదీ చూపిన ప్రత్యేక శ్రద్ధకు జిల్లా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు వీడియో
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

