Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

Samatha J
|

Updated on: Jun 15, 2025 | 5:13 PM

Share

మరణం తర్వాత జీవితం ఉంటుందా? చనిపోయాక ఎక్కడికి వెళతారు? ఏం చేస్తారు? అన్నది శతాబ్దాలుగా మనిషిని తొలుచేస్తున్న ప్రశ్న. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఇప్పటికీ అంత చిక్కడం లేదు. అయితే స్పెయిన్ కు చెందిన ఓ మహిళకు ఎదురైన ఆశ్చర్యకరమైన అనుభవం ఇప్పుడు ఈ చర్చను మళ్ళీ పెంచింది. వైద్యపరంగా 24 నిమిషాల పాటు మరణించిన ఆమె ఆ తర్వాత తాను పొందిన అనుభవాన్ని పంచుకొని అందర్నీ ఆశ్చర్యపరిచింది.

 స్పెయిన్ లోని అండలూసియా ప్రాంతానికి చెందిన టెస్సా రొమెరో వృత్తిరీత్యా సామాజిక శాస్త్రవేత్త, జర్నలిస్ట్. ఆమె వయసు 57 ఏళ్లు. ఓ దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఓ రోజు ఉదయం తన కుమార్తెలను పాఠశాలలో దిగబెట్టి వచ్చిన తర్వాత టెస్సా అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. శ్వాస ఆడకపోవడంతో పాటు గుండె కూడా కొట్టుకోవడం ఆగిపోయింది. వైద్యులు దాదాపు అరగంట పాటు తీవ్రంగా శ్రమించి చివరకు ఆమెను బతికించారు. అయితే 24 నిమిషాల వ్యవధిలో టెస్సా పొందిన అనుభవం ఆమె జీవితాన్నే మార్చివేసింది. వైద్యపరంగా మరణించిన ఆ 24 నిమిషాల్లో తాను ఓ అద్భుతమైన, ప్రశాంతమైన అనుభూతిని పొందానని టెస్సా తెలిపారు. నొప్పి, విచారం, కాలం కూడా లేని ఓ ప్రపంచంలోకి ప్రవేశించానని తన భుజాలపై నుంచి ఏదో పెద్ద భారం దిగిపోయినట్లు అనిపించిందని ఆమె ఆ అనుభవాన్ని వర్ణించారు. తాను ఒక భవనం పై నుంచి తేలుతూ కింద ఉన్న తన నిర్జీవ శరీరాన్ని చూసుకున్నానని చెప్పారు. తాను చనిపోయాను అని తనకు తెలియదని చుట్టూ ఉన్న వారికి తాను కనిపించకపోయినా తాను సజీవంగా ఉన్నట్లు భావించానని ఆమె తన పుస్తకంలో రాసుకున్నారు. ఈ అనుభవం కల కాదని, భ్రమ అంతకంటే కాదని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియో

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్‌ రా అయ్యా వీడియో