రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో
అదిలాబాద్ లో రైతులను టార్గెట్ చేసి నిండా ముంచుతున్న నయా కేటుగాళ్ళ భరతం పట్టారు జిల్లా పోలీసులు. రైతు వేషంలో వెళ్లి రైతులను మోసం చేస్తున్న బ్యాంకు బ్రోకర్లను పట్టుకున్నారు. ఏకకాలంలో నాలుగు మండలాల్లో రైడ్స్ చేసి దళారులను తాట తీశారు. గుడిహత్నూర్ లోనే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో లోన్ రెన్యువల్ కోసం రైతుల నుండి కమిషన్ తీసుకుంటూ మోసం చేస్తున్న తొమ్మిది మంది బ్రోకర్లను రైతు వేషంలో వెళ్ళి పట్టుకున్నారు. వారిపై చీటింగ్ కేసు నమోదు చేశారు.
ఇదే స్టైల్లో జిల్లా వ్యాప్తంగా 34 మందిపై చీటింగ్ కేసు నమోదు చేసి వారి దగ్గర నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఏడాది రైతుకు బ్యాంకు రుణం ఇస్తుంది. ఆ రుణానికి ఏడు శాతం వడ్డీ ఉంటుంది. సంవత్సరం లోపు రుణం తీర్చేస్తే మూడు శాతం బోనస్ తిరిగి వస్తుంది. రుణాన్ని కట్టిన తర్వాత తదుపరి రుణం 20 నుంచి 30 శాతం వరకు పెంచి బ్యాంకు ద్వారా రైతులు తిరిగి మళ్ళీ రుణాన్ని పొందొచ్చు. బ్యాంకుల ద్వారా ఉన్న ఈ లోసుగును వాడుకుంటున్న మోసగాళ్ళు జిల్లాలోనే అమాయక రైతుల వద్ద ప్రతి ఏడాది రైతులు తీసుకున్న రుణాలను వార్షిక వడ్డీతో సహా కట్టేసి తిరిగి రైతులకు అధిక రుణాన్ని తీసుకున్న దానికన్నా అధికంగా వచ్చేలా చేసి వచ్చిన తేడాలలో రైతుల వద్ద నుంచి దాదాపు 5000 నుంచి 10,000 రూపాయల వరకు వసూలు చేస్తూ రైతులను నిండా ముంచుతున్నారని పోలీసులకు ఉప్పొంగింది.
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
