Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వార్నీ.. ఇదేం బిజినెస్‌ రా అయ్యా వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్‌ రా అయ్యా వీడియో

Samatha J
|

Updated on: Jun 14, 2025 | 12:58 PM

Share

వ్యవసాయ దేశమైన భారతలో వరి, పంటలు, కూరగాయలను సాగు చేస్తారు. చేపల పెంపకం, కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం కూడా చేపడతారు. మన రైతులను పాముల్ని పెంచమంటే భయంతో గజగజ వణికిపోతారు. ఎలాంటి భయం లేకుండా పాములను పెంచుతున్న గ్రామం ఒకటుందని మీకు తెలుసా? 20 ఏళ్ళు నుండి వ్యవసాయం చేసుకునే గ్రామస్తులు ఇప్పుడు వంద ఫామ్ లలో చెక్క పెట్టెల్లో విషపూరిత పాములను పెంచడం మొదలుపెట్టారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఆ గ్రామం ఎక్కడుందే? వారికి అంత ధైర్యం ఎక్కడిదో ఈ స్టోరీలో చూద్దాం. పామును చూడగానే ఎవరైనా ఆమెను దూరం పారిపోతారు. కాటు వేస్తుందని కర్రలతో కొట్టి చంపేస్తారు. కానీ అవే పాములు పెంపకంతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్న గ్రామం చైనాలో ఉంది.

ఆ గ్రామం పేరు జిసికియావు ప్రపంచంలోనే తమ ఆహారానికి సంబంధించి వినతైన అలవాట్లతో మీడియాలో తరచు వినిపించే పేరు చైనా. చైనాలో పాము మాంసాన్ని తింటారు. ఇంకా చెప్పాలంటే భారతదేశంలో పన్నీరు తినే విధంగా అక్కడ పాము మాంసం తింటారు. పాము కూర, పులుసు ఆ దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన వంటకాలో. చైనాలో ఓ గ్రామ ప్రజలు పాముల పెంపకాన్ని చేపట్టి కోట్లలో సంపాదిస్తున్నారు. అక్కడ ప్రజల ప్రధాన ఆదాయం వనరులు పాముల పెంపకం. స్నేక్ విలేజ్ జనాభా సుమారు వెయ్యి మంది. అయితే ఇక్కడ ప్రతి ఇంట్లో పాముల్ని పెంచుతారు. ప్రతి వ్యక్తి 30 వేల పాములను పెంచి తమ ఇళ్లనే పాముల పెంపకానికి ఆవాసంగా చేసుకుంటారు. ఇక్కడ ప్రతి ఏటా కోటి పాముల అమ్మకాలు జరుగుతాయని తెలుస్తుంది. ఈ ఆలోచన ఎలా పుట్టిందంటే స్నేక్ విలేజ్ లో యోంగ్ హాంగ్ చెంగ్ అనే రైతు ఒకరోజు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. పేదరికం కారణంగా వైద్యం చేయించుకోలేదు. నడవలేని పరిస్థితిలో అతను తన వ్యాధిని తానే తగ్గించుకోవాలని అడవిలో పామును పట్టుకొని దాని నుండి ఔషధం తయారుచేసి స్వీకరించాడు. వెంటనే కోలుకొని మామూలుగా నడవడం ప్రారంభించాడు. అప్పుడు అతను పాములు మనుషులను చంపమే కాదు అవి రక్షిస్తాయి కూడా అని గుర్తించాడు. పాము శరీర భాగాలతో తయారు చేసిన ఔషధాన్ని మార్కెటింగ్ చేశాడు చెంగ్. ఇవన్నీ చూసి పాముల పెంపకం ప్రారంభించాడు.