Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

Samatha J
|

Updated on: Jun 14, 2025 | 12:57 PM

Share

హనుమకొండ జిల్లా, కమలాపూర్ మండలం, వంగపల్లి గ్రామానికి చెందిన చిలువేరు ప్రశాంత్ ఆన్‌లైన్ గేమ్‌లకు అలవాటుపడి నష్టపోయాడు. జూదాల కోసం అప్పులు చేసి వాటిని తీర్చేందుకు దొంగతనాలకు అలవాటుపడ్డాడు. వంగపల్లి గ్రామంలో అందరితో కలివిడిగా ఉంటూనే వారి ఇళ్లలో చోరీలకు పాల్పడటం మొదలుపెట్టాడు. ఇలా కొద్ది రోజుల క్రిందట తన దగ్గరి మిత్రుడైన కోడెపాక మధుసూధన్ ఇంట్లో చోరీకి పాల్పడి 60 వేలు విలువచేసే బంగారం ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత పశువుల రమాదేవి ఇంటికి తాళం వేసి ఉడగ, అందులోను చొరబడి రెండు లక్షలు విలువచేసే నగలు దోచుకెళ్లాడు. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా భార్యతో కలిసి కమలాపూర్ స్టేషన్ కి వెళ్లి మరి పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. వి

చారణలో పోలీసులకు అన్ని పిట్టసంగతులు చెప్పి దర్యాప్తును దారి మళ్ళించాడు. చోరీలకు అలవాటుపడిన చిలువేరు ప్రశాంత్ మే 30న ఎలికటి దిలీప్ ఇంట్లో దొంగతనాలకు వెళ్ళాడు. ఆ సమయంలో ఇంట్లో దివ్య అనే గర్భిణి అతన్ని గమనించింది. దీంతో తన భాగోతం బయటపడుతుందని భావించిన ప్రశాంత్ ఆమెను చంపేందుకు ప్రయత్నం చేశాడు. కొడవలితో తలపై దాడి చేశాడు. ఆమె చనిపోయిందనుకొని ఒంటిపై ఉన్న మూడు తులాల బంగారంతో అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత ఏమి తెలియనట్లుగానే వెనక్కి వచ్చి భార్యతో కలిసి కమలాపూర్ ఆసుపత్రికి కాల్ చేశాడు. తనే దగ్గరుండి గాయపడిన గర్భిణిని గ్రామస్తులతో కలిసి కమలాపూర్ ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా ఆసుపత్రికి వెళ్ళాక స్పృహలోకి వచ్చిన గర్భిణి తనపై చిలువేరు ప్రశాంత్ దాడి చేసినట్లు కుటుంబ సభ్యులకు తెలిపింది. భాధితురాలు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు.