Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు వీడియో

Samatha J
|

Updated on: Jun 15, 2025 | 4:46 PM

Share

విజయనగరం జిల్లాలో ఆశ్చర్యకర సంఘటన జరిగింది. పెళ్లి ముహూర్తం నిశ్చయించిన రోజే వధువు తన ప్రియుడితో కలిసి పరారయింది. నగరం లోని వీటీ అగ్రహారానికి చెందిన ఓ యువతి గత కొంతకాలంగా నగరం లో ఉన్న ఓ షాపింగ్ మాల్ లో పనిచేస్తుంది. ఈ క్రమంలోనే అక్కడే పనిచేస్తున్న ఓ యువకుడిని ప్రేమించింది. వారి ప్రేమ కాస్త మరింత పెరిగి తరచు కలుసుకోవడం మొదలయింది.

కూతురి ప్రేమ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెకు మేనమామ తో పెళ్లిని చేయించారు. జూన్ ఐదవ తేదీన విశాఖపట్నం సింహాచలంలో వివాహం జరగాల్సింది. పెళ్లికి ఐదు రోజుల ముందు ప్రియుడు ఆ యువతి ఇంటికి వచ్చి గొడవపడ్డాడు. ఈ విషయం పై యువతి కుటుంబ సభ్యులు అతనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అనూయంగా ప్రణాళికబద్ధంగా స్కెచ్చ వేసుకొని పెళ్లి రోజే ఆ యువతి తన ప్రియుడితో కలిసి పరారయింది. ఇద్దరూ మేజర్లు కావడంతో చేసేది లేక యువతి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ప్రస్తుతం ప్రేమజంట కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియో

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్‌ రా అయ్యా వీడియో