కౌగిలించుకుంటే కాసుల పంట ఆ దేశంలో వినూత్న ట్రెండ్ వీడియో
పొరుగు దేశం చైనాలో ప్రస్తుతం ఒక వింతైన ఆసక్తికరమైన ట్రెండ్ ఊపందుకుంది. అక్కడ అమ్మాయిలు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి మ్యాన్ హమ్స్ సహాయం తీసుకుంటున్నారు. అబ్బాయిలు అమ్మాయిలను కౌగలించుకున్నందుకు యువత నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ హగ్గింగ్ సేవకు ఆ దేశంలో చాలా డిమాండ్ ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం మ్యాన్ మమ్స్ అనే పదాన్ని జిమ్ చేసి కండారాల శరీరం ఉన్న అబ్బాయిలకు ఉపయోగిస్తారు.
యువతలు పని వలన లేదా చదువు వలన ఒత్తిడి వంటి వ్యక్తిగత సమస్యలతో ఇబ్బంది పడుతున్నప్పుడు వాటిని అధిగమించడానికి మ్యాన్ మమ్స్ లను నియమించుకుంటారు. ఇలా యువకులు ఒక కౌగిలింతకు 20 నుంచి 50 యువాన్లు అంటే మన దేశ కరెన్సీలో 250 రూపాయల నుంచి 600 వసూలు చేస్తారన్నమాట. ఇలా కౌగిలింత సమయం సాధారణంగా 5 నిమిషాలు ఉంటుంది. అబ్బాయి అమ్మాయిని ఇలా 5 నిమిషాల పాటు హగ్ చేసుకుంటారు. ఒక విద్యార్థిని తన తీసిస్ ఒత్తిడితో చాలా విసిగిపోయానని అప్పుడు తనకు ఉపశమనం కోసం ఎవరినైనా కౌగలించుకోవాలనిపించిందని అందుకోసం ఎంత డబ్బైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నానని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ట్రెండ్ వేగంగా వ్యాపించింది. ఆ అమ్మాయి తాను స్కూల్లో ఒకరిని కౌగలించుకున్నానని ఇలా చేసిన తర్వాత తనకు చాలా బాగుందని చెప్పింది.
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

