రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు…అంతలో వీడియో
ప్రస్తుతకాలంలో ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు, రీల్స్ తీసుకోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఓ యువకుడు ట్రైన్‌లో వెళ్తూ సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. ట్రైన్ వేగంగా దూసుకెళ్తుండగా ఆ యువకుడు డోర్ వద్దకు వచ్చి డోర్ రాడ్‌ను పట్టుకొని బయటకు వేలాడుతూ సెల్ఫీ తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా సెల్ఫీ వీడియోకి ట్రై చేశాడు.
రైలు వేగంగా దూసుకెళ్తుండటంతో అతని చేతిలోని ఫోను జారి కిందపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అప్పటి వరకూ హీరోలా ఫీలవుతూ సెల్ఫీ తీసుకుంటున్న యువకుడు ఫోన్ కిందపడిపోగానే నెత్తినోరూ బాదుకున్నాడు. త్వరగా దిగి ఫోన్ తెచ్చుకుందామా అంటే రైలు వేగంగా దూసుకుపోతోంది. దాంతో ఏడుపు మొహం వేసుకొని తన సీటులోకి వెళ్లి కూర్చున్నాడు. ఇదంతా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు, చాలా మంది ఈ వీడియోను లైక్ చేశారు. వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో
మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
పెళ్లి రోజు వధువు షాకింగ్ ట్విస్ట్.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

