Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా.. వీడియో

గేదెల షెడ్‌లో నుంచి ఒకటే శబ్ధాలు.. ఏమై ఉంటుందా అని వెళ్లి చూడగా.. వీడియో

Samatha J
|

Updated on: Jun 16, 2025 | 6:54 AM

Share

ఓ రైతు ఎప్పటిలాగే తన పశువుల షెడ్‌ వద్దకు వెళ్లాడు. షెడ్‌లో ఉన్న గేదెలు అదే పనిగా అరుస్తున్నాయి.. తాళ్లు తెంపుకునేందుకు ప్రయత్నిస్తూ అటూ ఇటూ తిరుగుతున్నాయి. ఏమై ఉంటుందా అని ఆయన దగ్గరకు వెళ్లి చూడగా షెడ్‌లో ఓ కింగ్‌ కోబ్రా గుడ్లతో సహా దర్శనమిచ్చింది. దానిని చూడగానే భయంతో పరుగులు తీసిన ఆ రైతు విషయం చుట్టుపక్కలవారికి చెప్పాడు. అక్కడికి చేరుకున్న వారంతా కోబ్రాను చూసి ఒకింత భయపడ్డారు. వెంటనే స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్‌ రెస్క్యూ టీమ్‌ చర్యలు చేపట్టింది. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

ఒడిశాలోని పూరీ జిల్లా పీపిలి బ్లాక్ పరిధిలోని సాన్పూర్ గ్రామంలో ఈ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. కోబ్రా వద్ద ఏకంగా 13 గుడ్లు ఉన్నాయి. స్థానిక రెస్క్యూ టీమ్… పాముతో పాటు గుడ్లను సురక్షితంగా షెడ్ నుంచి తొలగించింది. గుడ్లు పరిణితి చెంది పిల్లలుగా మారే వరకు పామును తమ రక్షణలో ఉంచారు. 13 గుడ్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కృత్రిమ ఇంక్యుబేటర్‌లో ఉంచి వాటి అభివృద్ధికి అనుకూల పరిస్థితులను కల్పించారు. కృత్రిమ గుడ్లను పొదిగించిన ప్రక్రియ పూర్తి కావడంతో వాటి నుంచి పాము పిల్లలు బయటపడ్డాయి. పాము పిల్లల్ని సురక్షితంగా తల్లి పాముతో కలిపి సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. వర్షాకాలం పాములు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు. చల్లదనం, వర్షాల కారణంగా పాములు ఎక్కువగా బయట కనిపించే అవకాశం ఉంటుందంటున్నారు. ఎవరైనా పాములు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు వీడియో