Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో

బంగారం కోసం వరుస పెళ్లిళ్లు.. చివరికి..వీడియో

Samatha J
|

Updated on: Jun 16, 2025 | 6:52 AM

Share

ఏడుగురు వ్యక్తులను వివాహం చేసుకుని, బంగారు మంగళసూత్రాలతో ఉడాయించిన పెళ్లికుమార్తె ఎనిమిదో పెళ్లికి రెడీ అవుతుండగా పోలీసులకు చిక్కింది. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. పొత్తన్‌కోడ్‌కు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధి ఒకరికి రేష్మా చంద్రశేఖరన్‌ అనే మహిళతో వివాహం నిశ్చయమైంది. అయితే, ఆమె ప్రవర్తనపై అనుమానం రావడంతో కాబోయే వరుడు పోలీసులను అప్రమత్తం చేశాడు. దాంతో ఆమె గుట్టు రట్టయింది. గత నెలలో ఒక మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా రేష్మా తనకు పరిచయమైందని, ఆమెను వివాహం చేసుకోవాలనుకున్న యువకుడు పోలీసులకు చెప్పాడు. మధ్యవర్తిగా పరిచయం చేసుకున్న ఒక మహిళ ద్వారా రేష్మా గురించి తెలిసిందని, ఆ తర్వాత కొట్టాయంలోని ఒక మాల్‌లో తాము కలిశామని వివరించాడు

తాను అనాథనని, తనకు బంధువులు పెద్దగా ఎవరూ లేరని, అందుకే జూన్ 6న జరగాల్సిన తమ వివాహానికి తనవైపు నుంచి ఎవరూ రారని రేష్మా చెప్పినట్లు అతను తెలిపాడు.అయితే, వివాహానికి ముందు రోజు సాయంత్రం కాబోయే వరుడి స్నేహితుడి ఇంటికి రేష్మా వెళ్లినప్పుడు అనుమానాలు బలపడ్డాయి. ఆమె ప్రవర్తనలో తేడా గమనించిన స్నేహితుడి భార్య, కాబోయే వరుడిని హెచ్చరించింది. శుక్రవారం రేష్మా బ్యూటీ పార్లర్‌కు రాగానే, ఆమె హ్యాండ్‌బ్యాగ్‌ను తనిఖీ చేయగా, గతంలో జరిగిన పలు వివాహాలకు సంబంధించిన పత్రాలు లభ్యమయ్యాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పోలీసు అధికారుల కథనం ప్రకారం, వివాహం తంతు ముగిసి, వరుడు మంగళసూత్రం కట్టిన తర్వాత కొన్ని రోజులకే ఆమె అదృశ్యమయ్యేది. తర్వాత ఎవరికీ అందుబాటులో ఉండేది కాదని పోలీసులు తెలిపారు. “విచారణలో లభించిన సమాచారం ఆధారంగా ఆమె గతంలో వివాహం చేసుకున్న వ్యక్తులను సంప్రదిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే కాకుండ ఆమె మరో రెండు వివాహాలు చేసుకోవడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. రేష్మను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం :

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు వీడియో