మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో
కాఫీ ప్రియులకు ముఖ్యంగా మహిళలకు ఇది నిజంగా ఓ శుభవార్త. రోజూ మీరు ఎంతో ఇష్టంగా తాగే కాఫీ మీకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అది పరిమితంగా తాగాలన్న విషయం మర్చిపోవద్దు. ఈ కాఫీ మీకు నిద్ర మత్తు వదిలించడమే కాకుండా మీ ఆయురారోగ్యాలను పెంపొందించి వృద్ధాప్యంలో కూడా మీరు చక్కని ఆరోగ్యంతో ఉండేందుకు తోడ్పడుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. హార్వర్డ్ టిహెచ్ చాన్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ టొరంటో విశ్వవిద్యాలయ పరిశోధకులు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనం మహిళల దీర్ఘకాలిక ఆరోగ్యంపై కాఫీ సానుకూల ప్రభావాన్ని చూపుతుందని వెల్లడించింది.
సుమారు 47,513 మంది మహిళల ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై 30 ఏళ్లపాటు సేకరించిన డేటాను విశ్లేషించిన ఈ అధ్యయనం పలు ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది. ముఖ్యంగా మధ్యవయసులో కాఫీని రోజూ సేవించే మహిళలు వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా జీవించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని తెలిసింది. రోజుకు కనీసం మూడు నుంచి ఐదు చిన్న కప్పులు కాఫీ తాగే మహిళల్లో చెప్పుకోదగ్గ ప్రయోజనాలు కనిపించాయని పరిశోధకులు తెలిపారు. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అంటే 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు వరకు జీవించడం, 11 ప్రధాన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి విముక్తి, మంచి శారీరిక పనితీరు, ఉత్తమ మానసిక ఆరోగ్యం, ఎటువంటి జ్ఞానపరమైన లోపాలు లేకపోవడం వంటి అంశాలను ఈ అధ్యయనంలో పరిగణించారు. ఆశ్చర్యకరంగా టీ లేదా ఇతర కాఫినేటెడ్ పానీయాల వల్ల ఆరోగ్యకరమైన వృద్ధాప్యంపై అంతగా సానుకూల ప్రభావం కనిపించలేదని ఈ అధ్యయనం పేర్కొంది.
మరిన్ని వీడియోల కోసం :
ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియో
రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో
వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
