Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో

Samatha J
|

Updated on: Jun 16, 2025 | 6:54 AM

Share

అదృష్టం ఎప్పుడు, ఎవరి తలుపు తడుతుందో చెప్పలేం. తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తుకోసం కలలు కంటారు. అందుకు ప్రణాళికలు వేస్తుంటారు. అలా ఓ తండ్రి తన కొడుకు భవిష్యత్తు కోసం చేసిన తన శక్తిమేరకు చేసిన ఆ పని ఇప్పడు కొడుక్కి కోట్లలో ఫలాలను అందించడంతో ఆ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. సుమారు 34 సంవత్సరాల క్రితం, అంటే 1990లో ఓ వ్యక్తి జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీకి చెందిన షేర్లలో లక్ష రూపాయల మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారు. ఆ రోజుల్లో అది చెప్పుకోదగ్గ మొత్తమే అయినప్పటికీ, కాలక్రమేణా ఆ పెట్టుబడి విషయం దానికి సంబంధించిన పత్రాల గురించి ఆయన పూర్తిగా మర్చిపోయారు. ఆ పత్రాలు ఎక్కడో ఓ మూలన పడిపోయాయి.సంవత్సరాలు గడిచిపోయాయి.

ఇటీవలి కాలంలో ఆయన కుమారుడు ఇంట్లో ఏవో పాత కాగితాలు సర్దుతుండగా ఈ షేర్లకు సంబంధించిన పత్రాలు కంటపడ్డాయి. కుతూహలంతో ఆ పత్రాలను తీసుకుని, వాటి ప్రస్తుత విలువ ఎంత ఉంటుందోనని ఆరా తీశాడు. ఆరా తీసిన కొద్దీ వచ్చిన సమాచారం ఆయనను, వారి కుటుంబాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఒకప్పుడు లక్ష రూపాయలుగా ఉన్న ఆ పెట్టుబడి విలువ ప్రస్తుతం ఏకంగా 80 కోట్ల రూపాయలకు చేరిందని తెలియడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సంఘటన దీర్ఘకాలిక పెట్టుబడులు ఎంతటి అద్భుతమైన రాబడిని అందిస్తాయో చెప్పడానికి ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోంది. సరైన కంపెనీలో, సరైన సమయంలో పెట్టిన చిన్న పెట్టుబడి కూడా కాలక్రమేణా ఎంత పెద్ద మొత్తంగా మారుతుందో ఇది స్పష్టం చేస్తోంది. ఓపికతో ఎదురుచూస్తే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఊహించని లాభాలను అందిస్తాయని ఈ ఘటన నిరూపిస్తోంది. ఈ అదృష్టవంతుడైన పెట్టుబడిదారుడి వివరాలు, ఆయన కుటుంబ సభ్యుల గురించి పూర్తి సమాచారం తెలియరాలేదు. అయితే, సౌరవ్ దత్తా అనే ఒక నెటిజన్ ఈ ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’లో పంచుకోవడంతో ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎంతో మంది నెటిజన్లు ఈ వార్తపై స్పందిస్తూ, దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రాముఖ్యతను ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఒక్కసారిగా కుప్పకూలిన మహిళ..అరగంట తర్వాత వీడియో

మహిళలకు శుభవార్త.. అసలు విషయం ఏంటో వీడియో చూసేయ్యండి వీడియో

పెళ్లి రోజు వధువు షాకింగ్‌ ట్విస్ట్‌.. బిత్తరపోయిన కుటుంబ సభ్యులు వీడియో