Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తేలియాడుతూ ఎదురొచ్చినవి చూసి

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తేలియాడుతూ ఎదురొచ్చినవి చూసి

Phani CH
|

Updated on: Jun 13, 2025 | 6:04 PM

Share

సాధారణంగా సముద్రంలో చేపల వేటకు వెళ్తారు జాలర్లు. రోజూలాగే ఆరోజు కూడా జాలర్లు చేపల వేటకు బోటులో వెళ్తున్నారు. అయితే విచిత్రంగా వారికి సముద్రంలో నీటిపై తేలియాడుతూ కనిపించినవి చూసి షాకయ్యారు. దగ్గరగా వెళ్లి చూడగా పెద్ద ఎత్తున కొబ్బరికాయలు తేలుతూ వస్తూ కనిపించాయి. వెంటనే ఈరోజు గంగమ్మ మనకు చేపలకు బదులు కొబ్బరికాయలు ప్రసాదించినట్టుంది అనుకొని వాటన్నిటినీ సేకరించి బోటులో వేసుకొని ఒడ్డుకు చేరారు.

ఈ ఘటన కన్నూరు జిల్లా అజీక్కల్‌లో జరిగింది. జూన్‌ 3వ తేదీ మంగళవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో 25 మంది మత్స్యకారుల బృందం నౌకతో పాటు రెండు చిన్న పడవలతో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో.. వారు చేపలు దొరక్క నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. అజీక్కల్ తీరంలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో వారు కన్నూరు హార్బర్ వైపు ప్రయాణం సాగించారు. ఈ క్రమంలో సముద్రంలో గుంపులుగా తేలియాడుతున్న కొబ్బరికాయలను గుర్తించారు. ‘మేము 300 కంటే ఎక్కువ కొబ్బరికాయలను సేకరించాము. ఇవి పూర్తిగా తడిసిపోయి నలుపు రంగులో మారిపోయినా, వాడటానికి అనువుగా ఉన్నాయి’ అని నౌక యజమాని బైజు చెప్పారు. పైయంబలం తీరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో త్రీపు చెట్ల అవశేషాలు, ఇతర తుపాను శిధిలాల మధ్య ఇవి కనిపించాయి. భారీ వర్షాల కారణంగా నదుల ప్రవాహం సముద్రంలోకి చేరింది. అలా నదీ పరివాహక ప్రాంతాల్లో చెట్ల నుంచి రాలిన కొబ్బరికాయలు.. నీటి ప్రవాహంలో కలిసి ఇలా సముద్రంలోకి వచ్చినట్లు భావిస్తున్నారు. వర్షాకాలంలో అజీక్కల్ తీరంలో పడవలు నడపడం కష్టంగా మారుతుంది కాబట్టి.. చాలా మంది జాలర్లు కన్నూరు హార్బర్ నుంచి తమ వేటను కొనసాగిస్తారు. తీరానికి చేరిన తర్వాత మిగతా మత్స్యకారులు ఈ వివరాన్ని తెలుసుకుని మరికొంత మంది సముద్రంలోకి వెళ్లి 800 కంటే ఎక్కువ కొబ్బరికాయలను సేకరించారు. వాటిని శుభ్రపరిచి అమ్మడం ద్వారా జాలర్లకు కొంత ఆదాయం లభించింది. ‘చేపలు దొరకని రోజుల్లో ఇలా కొబ్బరికాయలను అమ్మడం తమకు కొంత ఉపశమనం ఇచ్చింది’ అని బైజు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తవ్వకాలు జరుపుతుండగా బయటపడింది చూసి అంతా షాక్‌

సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లిన జంట.. రాత్రికి రాత్రే

విధి లిఖితం అంటే ఇదే కావచ్చు! ఒక్క రోజు తేడాతో ఈ స్టార్ హీరోల ఇళ్లలో తీవ్ర విషాదం

కనిపించింది కొద్దిసేపే అయినా.. కుర్రాళ్లను కనికట్టు చేసిందిగా..

చేసిన రచ్చ ఫలితం.. కల్పిక పై పోలీస్‌ కేస్‌