కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేసి నిర్ఘాంతపోయిన వైద్యులు
ఆసుపత్రి వైద్య బృందం అరుదైన శస్త్ర చికిత్స ద్వారా ముధోల్ మండలం చింతకుంట గ్రామానికి చెందిన చిన్నమ్మ అనే మహిళ ప్రాణాలను కాపాడారు. తీవ్రమైన కడుపు నొప్పితో సతమతం అవుతూ ఉండటంతో.. ఆమెను మూడు రోజుల క్రితం భైంసా ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. టెస్టులు చేసిన డాక్టర్లు రిపోర్టులు చూసి షాకయ్యారు.
ఆమెకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తీవ్రమైన నొప్పి వంటి అనారోగ్య సమస్యలు ఉండటంతో కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రి డాక్టర్లను ఆశ్రయించారు. టెస్టులు చేసిన మెడికల్ టీం చిన్నమ్మ కడుపులో 6 కిలోల బరువున్న కణితి ఉన్నట్లు గుర్తించింది. డాక్టర్ ఆపూర్వ రజనీకాంత్, డాక్టర్ ప్రీతి నేతృత్వంలో ప్రత్యేక డాక్టర్ల టీమ్ బాధిత మహిళకు శస్త్ర చికిత్స నిర్వహించింది. సుమారు రెండున్నర గంటలపాటు కొనసాగిన ఈ ఆపరేషన్ విజయవంతమైంది. కడుపులోని పెద్ద కణితిని తొలగించి.. మహిళ ప్రాణం నిలెబెట్టారు వైద్యులు. శస్త్ర చికిత్స విజయవంతమైందని, బాధితురాలు త్వరలోనే కోలుకుంటారని చెప్పారు డాక్టర్లు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండడంతో త్వరలో డిశ్చార్జ్ చేసే అవకాశముందన్నారు. అరుదైన ఈ శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ల బృందాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.కాశీనాథ్ ప్రత్యేకంగా అభినందించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తేలియాడుతూ ఎదురొచ్చినవి చూసి
తవ్వకాలు జరుపుతుండగా బయటపడింది చూసి అంతా షాక్
సరదాగా రెస్టారెంట్‌కు వెళ్లిన జంట.. రాత్రికి రాత్రే
విధి లిఖితం అంటే ఇదే కావచ్చు! ఒక్క రోజు తేడాతో ఈ స్టార్ హీరోల ఇళ్లలో తీవ్ర విషాదం
కనిపించింది కొద్దిసేపే అయినా.. కుర్రాళ్లను కనికట్టు చేసిందిగా..

సర్కారు ఆఫీసుకు దిష్టి.. పోవటానికి ఏం చేసారో తెలుసా

చోరీకి వెళ్లిన ఇంట్లోనే 3 రోజులు మకాం వేసిన దొంగ.. ఆ తర్వాత

బటర్ నాన్ ఆర్డర్ చేశాడు.. సరిగ్గా తినే టైంకి..

ఆకాశంలో ఉండగా విమానంలో వింత శబ్దాలు.. ఇదేం ఖర్మ రా నాయన..!

ప్రియురాలి కరివేపాకు కోరిక.. దేశాలు దాటి వచ్చిన ప్రియుడు

ఫ్రిజ్లో వింత సౌండ్స్.. వెళ్లి చూడగా గుండె గుభేల్

వాట్ ఏ టెక్నలాజియా.. బంతి లోయలో పడకుండా కుర్రాళ్ల జబర్దస్త్ ఐడియా
