Telugu Director: చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టు.. వాట్సాప్ వాడని డైరెక్టర్.. రాజమౌళి ప్రశంసలు.. ఎవరంటే..
తెలుగు సినీపరిశ్రమలో సక్సెస్ ఫుల్ దర్శకులలో ఆయన ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టు. భారీ బడ్జెట్ సినిమాలు కాకుండా అడియన్స్ మనసులను హత్తుకునే చిత్రాలను తెరకెక్కించడంలో ఆయన దిట్ట. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలను రూపొందించారు. నిత్యం వైవిధ్యమైన పాత్రలను తెరపైకి తీసుకువస్తుంటారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన డైరెక్టర్. ఇప్పటివరకు ఆయన రూపొందించిన సినిమాలన్నీ సూపర్ హిట్టు. డైరెక్టర్ రాజమౌళి సైతం ఆయన పై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ఆ దర్శకుడి గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు జక్కన్న. ఆ దర్శకులు ఇప్పటివరకు వాట్సాప్ వాడకుండా.. సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారట. ఇంతకీ అతడు ఎవరో తెలుసా.. ? ఇంకెవరు.. హ్యాపీడేస్, లవ్ స్టోరీ వంటి అందమైన చిత్రాలను అందించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ప్రస్తుతం ఆయన తెరకెక్కించిన సినిమా కుబేర. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, అక్కినేని నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రలలో నటించిన లేటేస్ట్ మూవీ ఇది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా జూన్ 20న అడియన్స్ ముందుకు రానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల పై ప్రశంసలు కురిపించారు. తాను నమ్మే సిద్ధాంతాలకు.. చేసే సినిమాలకు అసలు ఎలాంటి సంబంధం ఉండదని అన్నారు రాజమౌళి. కానీ శేఖర్ కమ్ముల మాత్రం తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని.. శేఖర్ చాలా సాఫ్ట్ గా ఉంటారని చెప్పుకొచ్చారు. తన సిద్ధాంతాలకు ఏది అడ్డొచ్చినా కొంచం కూడా ఆయన కాంప్రమైజ్ కారని వెల్లడించారు. తాను నమ్మినా సిద్ధాంతాల పైనే సినిమాలు తీస్తారని.. అందుకే ఆయనంటే తనకెంతో గౌరమని అన్నారు.
మీరు వాట్సాప్ వాడుతారా అని శేఖర్ కమ్ములను రాజమౌళి అడగ్గా.. ఉపయోగించనని చెప్పారు. దీంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఈ కార్యక్రమంలో కుబేర ట్రైలర్ రాజమౌళి విడుదల చేశారు. గతంలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీపుల్, లవ్ స్టోరీ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..
సీరియల్లో పద్దతిగా.. వెకేషన్లో గ్లామర్‌గా.. రుద్రాణి అత్త అరాచకమే..
త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..
Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..








