AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: 5 ఏళ్లలో 11 సినిమాలు.. ఇండస్ట్రీలోనే సెన్సేషన్.. ప్రేమకోసం 22 ఏళ్ల వయసులోనే జీవితాన్ని కోల్పోయిన హీరోయిన్..

హీరోయిన్ ప్రత్యూష.. ఈతరం ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని పేరు. కానీ 90's కుర్రాళ్ల కలల రాణి. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. తక్కువ సమయంలోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. 22 ఏళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది.

Tollywood: 5 ఏళ్లలో 11 సినిమాలు.. ఇండస్ట్రీలోనే సెన్సేషన్.. ప్రేమకోసం 22 ఏళ్ల వయసులోనే జీవితాన్ని కోల్పోయిన హీరోయిన్..
Prathyusha
Rajitha Chanti
|

Updated on: Jun 16, 2025 | 9:35 PM

Share

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఒకప్పుడు అగ్రహీరోయిన్లలో ఆమె ఒకరు. తెలుగుతోపాటు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలంగాణలోని భువనగిరికి చెందిన ప్రత్యూష చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టింది. చిన్నప్పుడే తల్లితో కలిసి హైదరాబాద్ వచ్చిన ప్రత్యూష్.. ఒక టీవీ రియాల్టీ షోలో పాల్గొని శ్రీమతి లవ్లీ స్మైల్ అనే బిరుదును గెలుచుకుంది. అప్పట్లో ఆమె పేరు ఇండస్ట్రీలో మారుమోగింది. 1998లో మోహన్ బాబు నటించిన రాయుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో మోహన్ బాబు కూతురిగా కనిపించింది. ఆ సమయంలోఆమె వయసు కేవలం 18 సంవత్సరాలు మాత్రమే. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఈ మూవీ విడుదల కాకముందే మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

అప్పట్లో అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. కేవలం రెండేళ్లల్లో ఆమె నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. తెలుగుతోపాటు తమిళంలోనూ ఆమెకు వరుస సినిమాలు క్యూ కట్టాయి. తెలుగులో రాయుడు, శ్రీరాములయ్య, స్నేహమంటే ఇదేరా, కలుసుకోవాలని వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పట్లో హీరోయిన్ గా ఎదుగుతున్న రోజులు అవి. కేవలం 5 ఏళ్లల్లో 11 సినిమాల్లో నటించింది. అలాగే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ప్రత్యూష.

కానీ ఆకస్మాత్తుగా ఆమె చనిపోయిందన్న మరణవార్త ఇండస్ట్రీని కుదిపేసింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2002లో ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందనే వార్తలు ఇండస్ట్రీని షాక్ కు గురిచేసింది. ప్రత్యూష మరణించినప్పుడు ఆమె వయసు కేవలం 22 సంవత్సరాలు మాత్రమే.

Prathyusha News

Prathyusha News

ఇవి కూడా చదవండి :  

వయసు 41.. ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. క్రేజ్ చూస్తే దిమాక్ కరాబ్..

సీరియల్లో పద్దతిగా.. వెకేషన్‏లో గ్లామర్‏గా.. రుద్రాణి అత్త అరాచకమే..

త్రిష అందానికి రహస్యం ఇదేనట.. ఆ విషయంలో కండీషన్ పెట్టుకుందట..

Color Photo Movie: కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ బాధపడుతుందట..