- Telugu News Photo Gallery Cinema photos Period Dramas now trending in tollywood movie know the details here
టాలీవుడ్ లో టాప్ లేపుతున్న పీరియాడికల్ సినిమాలు.. హిట్ కోసం అదే దారిలో వెళ్తున్న సీనియర్ హీరో
ఈ మధ్య పీరియడ్ స్టోరీలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. మళ్లీ పీరియడ్ అంటే వందేళ్లు వెనక్కి వెళ్లడం కాదు.. ఏకంగా వందల ఏళ్లు వెనక్కి వెళ్తున్నారు మన దర్శకులు. హీరోలను ఒప్పించి అన్‌సంగ్ హీరోల చరిత్రలను బయటికి తీసుకొస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌లో అలాంటి హిస్టారికల్ సినిమాలు చాలానే వస్తున్నాయి. మరి వాటిపై ఓ లుక్ వేద్దామా..?
Updated on: Jun 16, 2025 | 9:43 PM

పీరియడ్ సినిమాల వైపు మన దర్శకుల చూపులు వెళ్తున్నాయి. ముఖ్యంగా ఒకప్పటి చరిత్రను బయటికి తీసుకొస్తున్నారు. అప్పట్లో తన 100వ సినిమా కోసం 1వ శతాబ్ధపు గౌతమీపుత్ర శాతకర్ణి కథను ఎంచుకున్నారు.

అలాగే తాజాగా గోపీచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా 7వ సెంచరీ రాజుది. ఈ చిత్ర టీజర్ విడుదలైందిప్పుడు. 7వ శతాబ్ధపు చరిత్ర మరిచిన రాజు కథను తీసుకొస్తున్నారు సంకల్ప్ రెడ్డి.

అలాగే పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా 16వ శతాబ్ధపు కథతో వస్తుంది. నాటి ఔరంగాజేబు పాత్ర కూడా ఇందులో ఉంది. కోహినూర్ వజ్రం చుట్టూ ఈ కథ సాగుతుంది. ఒరిజినల్ క్యారెక్టర్స్ చుట్టూ అల్లుకున్న ఫిక్షనల్ కథ వీరమల్లు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

విజయ్ దేవరకొండ సైతం ఇలాంటి పీరియడ్ కథతోనే త్వరలోనే రానున్నారు. రాహుల్ సంక్రీత్యన్ తెరకెక్కించబోయే సినిమాలో 18th సెంచరీ నేపథ్యం ఉంటుంది. 1854 నుంచి 1878 మధ్య జరిగిన ఓ యోధుడి కథ ఇది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. గతంలో టాక్సీవాలా ఇదే కాంబినేషన్‌లో వచ్చింది.

నిఖిల్ ఈ మధ్య ఎక్కువగా పీరియడ్ కథల వైపే వెళ్తున్నారు. ఈయన నటిస్తున్న ది ఇండియా హౌజ్ 19వ శతాబ్ధపు కథ. 1900 సమయంలో జరిగే నేపథ్యం ఇది. ఇక స్వయంభు కూడా పీరియడ్ డ్రామానే. 18వ శతాబ్ధపు ఒడిస్సా యోధుడి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. మొత్తానికి మన హీరోలు కథల కోసం సెంచరీలు దాటేస్తున్నారు.




