- Telugu News Photo Gallery Cinema photos Genelia Reacts On Marriage Rumours With John Abraham During Movie Shooting
Genelia : సెట్లో ఆ స్టార్ హీరోతో పెళ్లైపోయింది.. 14 ఏళ్ల తర్వాత అసలు విషయం చెప్పిన జెనీలియా.. ఎవరంటే..
జెనీలియా.. సౌత్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్. బాయ్స్ సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. పెళ్లి తర్వాత కొన్నేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలో తన సినీప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.
Updated on: Jun 16, 2025 | 8:37 PM

తెలుగులో ఒకప్పుడు తోపు హీరోయిన్. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే బాలీవుడ్ స్టార్ రితేశ్ దేశ్ ముఖ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఇద్దరు అబ్బాయిలు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది జెనీలియా.

చాలా కాలం తర్వాత ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది జెనీలియా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. బాలీవుడ్ హీరోతో సినిమా సెట్ లోనే తనకు పెళ్లి జరిగిందంటూ గతంలో జరిగిన ప్రచారం పై స్పందించింది జెనీలియా. ఆయన వార్తలు ఎవరు సృష్టించారో తనకు తెలుసన్నారు.

బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం, తాను గతంలో ఓ ప్రాజెక్ట్ కోసం కలిసి పనిచేశామని.. ఆ సినిమా సెట్ లో అనుకోకుండా తమ పెళ్లి జరిగిందంటూ అప్పట్లో విపరీతమైన ప్రచారం జరిగిందని.. అది కేవలం ప్రచారం మాత్రమే అని.. అందులో ఎలాంటి వాస్తవం లేదని.. తమకు అసలు పెళ్లే జరగలేదని చెప్పుకొచ్చింది.

కానీ కొంతమంది పీఆర్ లు ఇలాంటి వార్తలను సృష్టించారని.. కాబట్టి అలాంటి వార్తలు ఎందుకు ప్రచారం చేశారో వారినే అడగాలని తెలిపింది. జెనీలియా, జాన్ అబ్రహం కలిసి పనిచేసిన సినిమా ఫోర్స్, 2011లో విడుదలైన ఈమూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి పెళ్లి జరిగిందనే ప్రచారం నడిచింది.

సీన్ లో భాగంగా పంతులుగారు వీరిద్దరికి నిజమైన పెళ్లి చేసేశారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. ఇదిలా ఉంటే.. మొదటి సినిమాతోనే నటుడు రితేశ్ దేశ్ ముఖ్ తో ప్రేమలో పడింది జెనీలియా. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. చాలా కాలం తర్వాత జెనీలియా అమీర్ ఖాన్ జోడిగా సితారే జమీన్ పర్ చిత్రంలో నటించింది.




