Ram Charan: 12 ఏళ్ల తర్వాత బాలీవుడ్ లోకి రామ్ చరణ్ రీఎంట్రీ.. ఆ హిట్ డైరెక్టర్ తో..
రామ్ చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి..? ముందు అనుకున్న ఆర్డర్ మారబోతుందా..? పెద్ది తర్వాత సుకుమార్ కాకుండా మరో దర్శకుడు రేసులోకి వచ్చారా..? 12 ఏళ్ళ తర్వాత మరోసారి బాలీవుడ్ వైపు అడుగులేస్తున్నారా..? ఓ సెన్సేషనల్ డైరెక్టర్‌తో చరణ్ రెండో హిందీ సినిమా లాక్ అయిపోయిందా..? అసలేంటి ఆ ప్రాజెక్ట్..? ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు..?
Updated on: Jun 16, 2025 | 8:30 PM

రామ్ చరణ్ పెద్ది సినిమాతో బిజీగా ఉన్నారిప్పుడు. ఈ చిత్ర షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగానే జరుగుతుంది. 2026, మార్చి 27న విడుదల కానుంది ఈ చిత్రం. దీని తర్వాత రామ్ చరణ్ సినిమా ఏంటి అనే దానిపైనే ఈ మధ్య ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి.

ఆల్రెడీ సుకుమార్ లైన్‌లోనే ఉన్నారు.. ఈయన్ని కాదని మరో దర్శకుడు రేసులోకి వచ్చినట్లు తెలుస్తుందిప్పుడు. రంగస్థలం తర్వాత మరోసారి సుకుమార్‌తో సినిమా చేయబోతున్నారు చరణ్. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

ప్రస్తుతం చరణ్ సినిమా స్క్రిప్ట్ వర్క్‌తోనే బిజీగా ఉన్నారు లెక్కల మాస్టారు. అయితే ఈ గ్యాప్‌లోనే చరణ్, త్రివిక్రమ్ కాంబినేషన్ అంటూ వార్తలొచ్చాయి.. కానీ అందులో నిజం లేదని నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. తాజాగా కిల్ దర్శకుడు నిఖిల్ నగేష్ భట్ తెరపైకి వచ్చింది.

కిల్ ఫేమ్ నిఖిల్ నగేష్ భట్‌తో చరణ్ సినిమా ఉందంటూ గతంలోనే వార్తలొచ్చాయి. అయితే అదేం లేదంటూ అప్పట్లో కొట్టి పారేసారీయన. కానీ ఇప్పుడీ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యేలా కనిపిస్తుంది.

జంజీర్‌తో 12 ఏళ్ళ కింద నేరుగా బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారు చరణ్. ఇప్పుడు నిఖిల్ నగేష్‌తో సినిమా చేస్తే ఇది రెండోది అవుతుంది. సుకుమార్ కంటే ముందే ఈ సినిమా ఉంటుందా లేదంటే తర్వాత ఉంటుందా అనేది చూడాలిక.




