- Telugu News Photo Gallery Cinema photos Youthful friendship drama films are now trending in tollywood
టాలీవుడ్‌కు సరికొత్త సక్సెస్ ఫార్ములా.. ఈ జోనర్‌లో సినిమా తీస్తే హిట్ పక్కా
తెలుగు ఇండస్ట్రీకి సరికొత్త సక్సెస్ ఫార్ములా దొరికిందా..? ముగ్గురు ఫ్రెండ్స్ చుట్టూ కథలు అల్లుకుంటే సినిమా సూపర్ హిట్ ఖాయమా..? కరోనా తర్వాత ఈ తరహా కథలకు సక్సెస్ రేట్ కనిపిస్తుంది. అందుకే దర్శకులు అదే రూట్‌లో వెళ్తున్నారా..? తాజాగా మరో సినిమా కూడా ఈ జోనర్‌లోనే వస్తుంది. మరి అదేంటి..? దానికి ముందు వచ్చిన సినిమాలేంటి..?
Updated on: Jun 16, 2025 | 9:50 PM

Jathiratnalu (1)

2021లో వచ్చిన జాతి రత్నాలు నుంచి మొదలు పెడితే మొన్నొచ్చిన మ్యాడ్ స్క్వేర్.. ఇప్పుడొస్తున్న మిత్ర మండలి వరకు అన్నీ ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే ఫన్నీ స్టోరీసే.

తాజాగా మిత్రమండలి సినిమా వస్తుంది.. ఇందులో ప్రియదర్శి హీరోగా నటిస్తుంటే.. ఆయన స్నేహితులుగా మ్యాడ్‌లో లడ్డుగా నటించిన విష్ణు, రాగ్ మయూర్ అతడి స్నేహితులుగా నటిస్తున్నారు. అలాగే ప్రసాద్ బెహరా మరో కీలక పాత్రలో కనిపిస్తున్నారు.

బన్నీ వాస్ కొత్త బ్యానర్ BV ఆర్ట్స్‌లో ఈ సినిమా వస్తుంది. మిత్ర మండలి టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ముగ్గురు ఫ్రెండ్స్ అనే సెంటిమెంట్ బాగా కలిసొస్తుంది. బ్రోచేవారెవరురాతో పాటు ఓం భీమ్ బుష్‌లో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఫ్రెండ్స్‌గా నటించారు.

అలాగే జాతి రత్నాలులో నవీన్ పొలిశెట్టితో కలిసి రాహుల్, దర్శి నటించారు. మ్యాడ్ సిరీస్‌లో నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ నటించారు. ఆయ్ కూడా ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే కథే.




