Tollywood: 18 ఏళ్లకే బ్లాక్ బస్టర్స్.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్..
దాదాపు 20 ఏళ్లపాటు సినీరంగంలో చక్రం తిప్పిన హీరోయిన్. తెలుగులో స్టార్ హీరోలతో కలిసి అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న తర్వాత యాక్టింగ్ మానేసి ఇండస్ట్రీకి దూరమైంది. చాలా కాలం మీడియాకు కూడా కనిపించలేదు. ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వచ్చారు. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ?

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? దాదాపు 20 సంవత్సరాలు తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. 90వ దశకంలో తెలుగు, తమిళంలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఆమె మరెవరో కాదు. రవళి.. ఆమె 1990 లో మలయాళ చిత్రం జడ్జిమెంట్ ద్వారా అరంగేట్రం చేసింది. తర్వాత సంవత్సరం జయభేరి సినిమాతో టాలీవుడ్ లోకి వచ్చింది. కెరీర్ ప్రారంభంలో పెద్దగా అవకాశాలు రాలేదు. పెళ్లి సందడి సినిమా ఆమె కెరీర్ మలుపు తిప్పింది. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఒరేయ్ రిక్షా, వినోదం, చిన్నబ్బాయి, ముద్దుల మొగుడు, శుభాకాంక్షలు వంటి చిత్రాల్లో నటించి గురింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ పలు చిత్రాల్లో నటించింది.
ఇవి కూడా చదవండి : Actress: ఇండస్ట్రీని ఏలేసిన హీరోయిన్.. లగ్జరీ లైఫ్ వదిలి బ్రహ్మాకుమారిగా.. 45 ఏళ్ల వయసులో ఇలా.. గుర్తుపట్టారా.. ?
2007లో నీలికృష్ణను రవళి పెళ్లి చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఆమె సోదరి హరిత కూడా నటి కావడం విశేషం. తెలుగులో అనేక సీరియల్స్ చేసింది. చివరిగా తెలుగులో2011లో మాయగాడు చిత్రంలో నటించింది. తెలుగులో వెంకటేశ్, బాలకృష్ణ, మలయాళంలో మోహన్ లాల్ వంటి స్టార్ హీరోలతో నటించింది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రవళి.. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చింది.
ఇవి కూడా చదవండి : Cinema : ఇవేం ట్విస్టులు రా అయ్యా.. ఊహించని మలుపులు.. ఈ సినిమాను అస్సలు మిస్సవ్వద్దు..
పెళ్లి తర్వాత తన ఫ్యామిలీతో గడుపుతుంది రవళి. ఇటీవల హీరోయిన్ రోజాతో కలిసి దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుంది. రవళి స్వతహాగా తెలుగమ్మాయి. 18 ఏళ్లకే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. దాదాపు 20 ఏళ్లు ఇండస్ట్రీలో రాణించింది. అందమైన రూపం, సహజ నటనతో అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకుంది.
ఇవి కూడా చదవండి : Actress : శ్రీదేవికి వాయిస్ ఓవర్ ఇచ్చిన హీరోయిన్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న ఆర్టిస్ట్.. చివరకు ఊహించని విధంగా..




