- Telugu News Photo Gallery Cinema photos Tollywood Actress Komalee Prasad Visits Arunachalam Temple, See Photos
Tollywood: అరుణాచలేశ్వరుడిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా?
ప్రస్తుతం సోలో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు సహాయక నటిగా మెప్పిస్తోందీ అందాల తార. ఈ ఏడాది ఇప్పటికే ఓ వంద కోట్ల బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇటీవలే ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించింది.
Updated on: Oct 28, 2025 | 10:07 PM

ప్రస్తుతం పవిత్రమైన కార్తీక మాసం నడుస్తోంది. భక్తులందరూ శివాలయాలకు పోటెత్తుతున్నారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కోమలి ప్రసాద్ అరుణాచలేశ్వరుడిని దర్శించుకుంది.

తాజాగా అరుణాచలం వెళ్లిన కోమలి ప్రసాద్ అక్కడ ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం ఆలయం వెలుపల దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రస్తుతం తెలుగమ్మాయి అరుణాచల సందర్శన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

హిట్-2, హిట్-3 సినిమాల్లో సహాయక నటిగా మెరిసిన కోమలి ప్రసాద్ ఇటీవలే శశివదనే సినిమాలో సోలో హీరోయిన్ గా నటించింది. పల్లెటూరి ప్రేమకథతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడింది.

ప్రస్తుతం తమిళంలోనూ హీరోయిన్ గా ఓ సినిమా చేస్తోంది కోమలి ప్రసాద్. త్వరలోనే ఈ మూవీ తమిళ్ పాటు తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాల సంగతి పక్కన పెడితే కోమలి ప్రసాద్ డాక్టర్ కూడా. శాఖపట్నంలో పుట్టి పెరిగిన ఈ అందాల తార మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లోని ప్రవర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో మెడిసిన్ పూర్తి చేసింది.




