- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress In This Photo, She Is Once Basket Ball Player Now Top Heroine in Telugu Her Name Is Amritha Aiyer
Tollywood : 300 కోట్ల సినిమా హీరోయిన్.. అయినా ఆఫర్స్ కరువే.. ఎవరంటే..
ఒకప్పుడు బాస్కెట్ బాల్ ప్లేయర్.. కానీ ఆ తర్వాత నెమ్మదిగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదట్లో తమిళ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హీరోయిన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం, అభినయంతో మెప్పించినప్పటికీ ఈ బ్యూటీకి సరైన అవకాశాలు మాత్రం రావడం లేదు. ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా..
Updated on: Oct 29, 2025 | 3:03 PM

ప్రస్తుతం సినీరంగంలో రాణిస్తున్న హీరోయిన్స్.. అంతకు ముందు వివిధ రంగాల్లో ఉన్నత స్థాయిలో పనిచేసినవారే. డాక్టర్స్, ఇంజనీరింగ్స్ చేసి.. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ మాత్రం సినిమాల్లోకి రాకముందు ఫేమస్ బాస్కెట్ బాల్ ప్లేయర్. కానీ ఇప్పుడు క్రేజీ హీరోయిన్.

ఆమె సెలబ్రెటీ కావడానికి ముందు రాష్ట్ర స్థాయి బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి. చిన్నప్పటి నుంచి బాస్కెట్‌బాల్‌పై ఆసక్తి ఉన్న ఆమె.. అనేక రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొన్నారు. కానీ తరువాత, ఆమె నటనపై ఆసక్తి పెంచుకుని చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. ఆమె మరెవరో కాదండి హీరోయిన్ అమృత అయ్యార్.

మొదట సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన ఆమె.. తరువాత హీరోయిన్‌గా ఎదిగింది. ఇప్పుడు ఆమె తమిళం, తెలుగులో టాప్ హీరోయిన్. తమిళ చిత్రం 'పడైవీరన్' ద్వారా హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. అట్లీ దర్శకత్వం వహించిన విజయ్ నటించిన 'బిగిల్' చిత్రంలో అమృత అయ్యర్ కీలకపాత్ర పోషించింది.

రెడ్' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తేజా సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమాలో కనిపించింది. ఈ మూవీ రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పలు సినిమాల్లో నటిస్తుంది. కానీ హనుమాన్ సినిమా తర్వాత క్రేజ్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావడం లేదు. ఈ అమ్మడు సరైన అవకాశం కోసం వెయిట్ చేస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తుంది.




