ఈ నగరానికి ఏమైంది మూవీలో నటించిన ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందంటే

ఈ సినిమా ద్వారా విశ్వక్ సేన్ హీరోగా పరిచయం అయ్యాడు. 2018 లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించారు. ఈ మూవీలో విశ్వక్ సేన్ తో పాటు సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను నటించారు.

ఈ నగరానికి ఏమైంది మూవీలో నటించిన ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడు ఎలా ఉందంటే
Ee Nagaraniki Emaindhi
Follow us

|

Updated on: Sep 05, 2024 | 12:25 PM

చిన్న సినిమాగా వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది సినిమా ఒకటి. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా విశ్వక్ సేన్ హీరోగా పరిచయం అయ్యాడు. 2018 లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమా యూత్ ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాను సురేష్ బాబు నిర్మించారు. ఈ మూవీలో విశ్వక్ సేన్ తో పాటు సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను నటించారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా సిమ్రాన్‌ చౌదరి నటించింది. అయితే ఈ సినిమాలో మరో ముద్దుగుమ్మ కూడా నటించింది.

హైదరాబాద్ ఓ బార్ లో హీరోకు హీరో ఫ్రెండ్స్ కు పరిచయమైన ఆమె గోవాలో తిరిగి వీరిని కలుసుకుంటుంది. ఆ తర్వాత విశ్వక్ సేన్ ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ హీరోయిన్ గుర్తుందా.? ఆమె పేరు అనిషా అంబ్రోస్. ఈ అమ్మడు తెలుగుతో పాటు కన్నడ, మలయాళ సినిమాలలో హీరోయిన్ గానటిస్తుంది . ఈ అమ్మడు అలియాస్ జానకి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గోపాల గోపాల సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది ఈ బ్యూటీ.

తెలుగులో ఉన్నది ఒకటే జిందగి, ఒక్కడు మిగిలాడు, మనమంతా, ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లెడీస్ టైలర్ సినిమాల్లో నటించింది. ఇక ఇప్పుడు తమిళ్ లో నటిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో ఈ చిన్నది ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది.

అనిషా అంబ్రోస్ ఇన్ స్టా గ్రామ్

అనిషా అంబ్రోస్ ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి