ఆమె పాట వింటే రక్తం మరగాల్సిందే.. మూలనున్న ముసలోడు కూడా స్టెప్పేయాల్సిందే

ఆమె పాట వింటే రక్తం మరగాల్సిందే.. మూలన ఉన్న ముసలోడు కూడా స్టెప్పేయాల్సిందే. ఆమె గొంతు వింటేనే ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. పాటలతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అంతే కాదు సింగర్స్ అందరిలో తన రూటే సపరేట్ అంటూ దూసుకుపోతోంది ఆ చిన్నది.

ఆమె పాట వింటే రక్తం మరగాల్సిందే.. మూలనున్న ముసలోడు కూడా స్టెప్పేయాల్సిందే
Tollywood Singer
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 21, 2024 | 6:28 PM

సినిమా వాళ్లకు ఎంత క్రేజ్ ఉంటుందో సింగర్స్ కు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ఎంతో మంది సింగర్స్ తమ పాటలతో ఎంతో మంది అభిమానాలను సొంతం చేసుకున్నారు. కొంతమంది హీరోయిన్స్ కు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ ను కూడా సంపాదించుకున్నారు. అలాంటి వారిలో పైన కనిపిస్తున్న చిన్నది కూడా ఒకరు. ఆమె పాట వింటే రక్తం మరగాల్సిందే.. మూలన ఉన్న ముసలోడు కూడా స్టెప్పేయాల్సిందే. ఆమె గొంతు వింటేనే ఎక్కడలేని ఎనర్జీ వస్తుంది. పాటలతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. అంతే కాదు సింగర్స్ అందరిలో తన రూటే సపరేట్ అంటూ దూసుకుపోతోంది ఆ చిన్నది. కేవలం సినిమా పాటలతోనే కాదు జానపద గీతాలు ఆలపించడంలో ఆమె తర్వాతే ఎవరైనా అనేంతగా మారింది ఆమె. ఇంతకూ ఆ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.?

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

పల్లె పాటలకు పెట్టింది పేరు ఆమె.. పోరు బాటలో ఆమె గీతం.. ఎంతో మందికి దారి చూపిన దీపం.. ఆమె మరెవరో కాదు తెలంగాణ పాటల పూదోటలో విరిసిన ఎర్ర గులాబీ మధుప్రియ. ఈ సింగర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. తెలంగాణ ప్రజల ప్రతి గుండెకు దగ్గరైన మనిషి మధుప్రియ. ఐదవతరగతి చదువుతున్నప్పుడే “ఆడపిల్లనమ్మ” పాటతో చిన్న వయస్సులోనే మంచి పేరు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : నాగ చైతన్య ఫ్రెండ్ గా నటించాడు.. కట్ చేస్తే అతనికంటే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ హీరో అయ్యాడు. 

మధుప్రియ ఎన్నో విప్లవ గీతాలను ఆలపించింది. తెలంగాణ ప్రజా గాయకుడు గద్దర్ తో కలిసి ఎన్నో గీతాలను ఆలపించింది. అలాగే ఎన్నో ప్రదర్శనలు కూడా చేసింది. ఇక మధు ప్రియ దగ్గరగా దూరంగా చిత్రంలో పాట పాడటంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఫిదా సినిమాలోని “వచ్చిందే” పాటకు  ఆమె ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ ఫిమేల్‌గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకుంది. అలాగే మధుప్రియ స్టార్ మా రియాలిటీ  గేమ్ షో బిగ్ బాస్ లోనూ పాల్గొంది . తాజాగా మధుప్రియ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా తన పాటలు, ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఇది కూడా చదవండి : తస్సాదీయ్యా..! స్వీటీ పక్కనున్నబ్యూటీని గుర్తుపట్టారా.? బడా డైరెక్టర్ భార్య ఆమె..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..