AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. 17ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో ప్రభాస్..

దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. అంతే కాదు తన సత్తా ఏంటో బాక్సాఫీస్ కు మరోసారి చూపించాడు రెబల్ స్టార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత వెంటనే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు..

Prabhas: థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. 17ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్‌తో ప్రభాస్..
Prabhas
Rajeev Rayala
|

Updated on: Nov 21, 2024 | 3:32 PM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ చేసిన సినిమాలు చూస్తే మెంటలెక్కుతోంది. గ్యాప్ ఇవ్వకుండా వరుసగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు డార్లింగ్ అంతే కాదు ఆయా షూటింగ్స్ లో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ప్రభాస్ స్పీడ్ చూసి మిగతా హీరోలు ఆశ్చర్యపోతున్నారు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. అంతే కాదు తన సత్తా ఏంటో బాక్సాఫీస్ కు మరోసారి చూపించాడు రెబల్ స్టార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆతర్వాత వెంటనే కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి సినిమా ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగా వసూల్ చేసి సంచలన విజయాన్ని అందుకుంది. సలార్, కల్కి సినిమాలకు సెకండ్ పార్ట్స్ కూడా రానున్నాయి.

ఇది కూడా చదవండి : తస్సాదీయ్యా..! స్వీటీ పక్కనున్నబ్యూటీని గుర్తుపట్టారా.? బడా డైరెక్టర్ భార్య ఆమె..

ఈ క్రమంలోనే మరికొన్ని సినిమాలను కూడా లైనప్ చేశాడు ప్రభాస్. వాటిలో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న రాజా సాబ్ సినిమా ఒకటి. టైటిల్ తోనే ఈ సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. మొదటి సారి ప్రభాస్ లుంగీ కట్టుకున్న మాస్ లుక్ ను రిలీజ్ చేశారు.ఆతర్వాత సూట్ వేసుకున్న క్లాస్ లుక్ ను రిలీజ్ చేశారు. ఆతర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ప్రభాస్ స్టైల్స్ లుక్ వదిలారు.. రీసెంట్ గా ఫ్యాన్స్ కు దిమ్మతిరిగేలా ఓ డిఫరెంట్ లుక్ వదిలారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ ఓల్డ్ గెటప్ లో కనిపించి షాక్ ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :ఇదేందయ్యా ఇది..! ప్రస్తుతం పాన్ ఇండియన్ ఊపేస్తున్న ఈ హీరోగారిని గుర్తుపట్టారా.?

దాంతో ఈ సినిమాలో ప్రభాస్ రెండు డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడని క్లారిటీ వచ్చింది. అలాగే ఈ సినిమా హరర్ నేపథ్యంలో ఉంటుందని కూడా అర్ధమవుతోంది. రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ సరసన ఐదుగురు హీరోయిన్స్ కనిపిస్తారని టాక్. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజా సాబ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ టాక్ ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ ఓ స్టార్ హీరోయిన్ చేస్తుందని అంటున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు లేడీ సూపర్ స్టార్ నయనతార. అవును.. ఇప్పుడు ఇదే వార్త తెగ వైరల్ అవుతోంది. నయన్ ప్రభాస్ తో యోగి సినిమా చేసిన విషయం తెలిసిందే. దాదాపు 17 ఏళ్ల తర్వాత ప్రభాస్, నయన్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని టాక్. మరి ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 10న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో పాటు సందీప్ రెడ్డి స్పిరిట్,హనురాఘవాపుడి మూవీని కూడా లైనప్ చేశాడు ప్రభాస్. అదేవిధంగా మంచు విష్ణు తెరకెక్కిస్తున్న కన్నప్ప సినిమాలోనూ గెస్ట్ గా కనిపించనున్నాడు ప్రభాస్.

ఇది కూడా చదవండి : నాగ చైతన్య ఫ్రెండ్ గా నటించాడు.. కట్ చేస్తే అతనికంటే ఎక్కువ సినిమాలు చేస్తూ బిజీ హీరో అయ్యాడు. 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
ఐటీ ఉద్యోగులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి జీతాలు పెంపు
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
మాటలు కరువయ్యాయి.. వైభవ్ విధ్యంసం పై ఎంపీ కామెంట్
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
వామ్మో.. ఈ కూరగాయ మొక్క వల్లే భార్యాభర్తలు విడిపోతున్నారా?
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి