AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చేసింది తక్కువ సినిమాలు.. రూ. 200కోట్ల ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ తక్కువ సినిమాలతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. అలాగే స్టార్ డమ్ కూడా సొంతం చేసుకుంటున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. కొంతమంది కనిపించకుండా మాయం అవుతున్నారు. ఇక ఈ అమ్మడు చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన పాపులర్ అయ్యింది.

చేసింది తక్కువ సినిమాలు.. రూ. 200కోట్ల ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Nov 09, 2025 | 2:20 PM

Share

చాలా మంది హీరోయిన్ స్టార్ డమ్ కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్స్ తమ అందాలతో ప్రేక్షకులను కవ్విస్తున్నారు. అలాగే తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అలాగే చాలా మంది హీరోయిన్స్ ఇతర భాషల నుంచి వచ్చి టాలీవుడ్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఈ చిన్నది కూడా వేరే భాష నుంచి వచ్చి తెలుగులో ప్రేక్షకులకు దగ్గరైంది.  తెలుగులో ఈ బ్యూటీ చేసిందే తెలుగులో మూడు సినిమాలు.. వాటిలో ఒక ఒక్క సినిమా హిట్ అయ్యింది. మిగిలిన రెండు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. కానీ తన అందంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

బాలయ్యకు లవర్‌గా, తల్లిగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఈ అమ్మడు తెలుగులో సినిమాలుతగ్గించడంతో అభిమానులు కూడా చాలా ఫీల్ అవుతున్నారు. అంతే కాదు మనకు వచ్చే లవర్ కూడా ఇలానే ఉండాలి అని కుర్రాళ్ళు అంతా అనుకునేలా తన అందంతో కవ్వించింది. ఇంతకూ ఆమె ఎవరో కాదు.. కళ్యాణి ప్రియదర్శన్. ఈ ముద్దుగుమ్మ అక్కినేని అఖిల్ హీరోగా నటించిన హలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ సినిమా నిరాశపరిచింది కానీ.. కళ్యాణి తన నటనతో, అందంతో ఆకట్టుకుంది. హలో సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో ఆకట్టుకుంది.

7/జీ బృందావన్‌ కాలనీ సీక్వెల్‌లో హీరోయిన్ ఈమేనా..! అందం అదిరిపోయిందిగా..

చిత్రలహరి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత శర్వానంద్ తో రణరంగం అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఇక రీసెంట్ గా కొత్త లోక సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా డిఫరెంట్ కథతో తెరకెక్కింది. ఈ సినిమా ఏకంగా రూ. 100కోట్లు వసూల్ చేసింది. ప్రస్తుతం ఈ చిన్నది మలయాళంలో సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. తెలుగులో మంచి అవకాశం వస్తే చేయడానికి రెడీగా ఉంది. ఇక సోషల్ మీడియాలో ఈ బ్యూటీ షేర్ చేసే ఫోటోలు అభిమానులను, నెటిజన్స్ ను ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

పెళ్ళికి ముందే తల్లైంది.. కట్ చేస్తే విడాకులు.. ఇప్పుడు తనకన్నా 7ఏళ్ల చిన్నవాడితో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us