AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: ఓటీపీ అవసరం లేకుండానే వాట్సప్‌లోకి లాగిన్ అవ్వొచ్చు.. ఇది మాములు ఫీచర్ కాదు భయ్యా..

వాట్సప్‌లోకి లాగిన్ అవ్వాలంటే ముందుగా మొబైల్ నెంబర్ ధృవీకరించాల్సి ఉంటుంది. ముందుగా నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేశాక వాట్సప్‌లోకి లాగిన్ అవ్వుతాం. కానీ ఇక నుంచి ఓటీపీ అవసరం లేకుండానే ఆటోమేటిక్‌గా లాగిన్ అవ్వొచ్చు.

WhatsApp: ఓటీపీ అవసరం లేకుండానే వాట్సప్‌లోకి లాగిన్ అవ్వొచ్చు.. ఇది మాములు ఫీచర్ కాదు భయ్యా..
Whatsapp
Venkatrao Lella
|

Updated on: Jun 05, 2026 | 3:43 PM

Share

సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ అయిన ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ లాంటివి లాగిన్ అవ్వాలంటే ఖచ్చితంగా మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తొలిసారి లాగిన్ అయ్యే సమమంలో ఓటీపీ అవసరం పడుతుంది. మీ ఫోన్ నుంచే మీ మొబైల్ నెంబర్‌ ఆధారంగా లాగిన్ అవుతన్నారని ధృవీకరించేందుకు ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. భద్రతా కారణాల వల్ల సోషల్ మీడియా సంస్థలు లాగిన్ సమయంలో ఓటీపీని తప్పనిసరి చేశాయి. అయితే తాజాగా Meta భాగస్వామ్యంతో వొడాఫోన్ ఐడియా తన వినియోగదారుల కోసం అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది.

ఓటీపీ అవసరం లేదు..

వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో లాగిన్ అవ్వాలంటే ఓటీపీ అవసరం లేదు. ఆటోమేటిక్‌గా నెట్‌వర్క్ ధృవీకరణ ఆధారంగా లాగిన్ అవుతుంది. ఇందుకోసం సైలెంట్ మొబైల్ వెరిఫికేషన్ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వొడాఫోన్ ఐడియా ప్రకటించింది. ఈ కొత్త టెక్నాలజీ ఆధారంగా Vi వినియోగదారులు తమ మొబైల్ నెట్‌వర్క్‌లో వాట్సప్, ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించినప్పుడు మొబైల్ నంబర్ ద్వారా బ్యాగ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా వెరిఫికేషన్ పూర్తవుతుంది. దీని వల్ల Vi వినియోగదారులకు ఓటీపీ రహిత లాగిన్‌ సదుపాయం పొందవచ్చు. కొన్నిసార్లు ఓటీపీలు అందవు. మరికొన్ని సార్లు చాలా టైమ్ పడుతుంది. ఈ ఫీచర్ వల్ల ఓటీపీ అవసరం లేకపోవడంతో వేగవంతంగా లాగిన్ అవ్వొచ్చు.

SMV అంటే ఏంటి..?

ఎస్‌ఎంవీ అనేది ఒక సురక్షితమైన నెట్‌వర్క్ ఆధారిత ప్రమాణీకరణ సాంకేతికత. వినియోగదారుడి మొబైల్ నంబర్‌ను బ్యాగ్రౌండ్‌లో ధృవీకరిస్తుంది. దీంతో వెరిఫికేషన్ వివరాలను మాన్యువల్‌గా నమోదు చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే యాప్‌ల మధ్య మారడం లేదా ధృవీకరణ మెస్సేజ్ కోసం వేచి ఉండటం వంటి అవసరం ఉండదు. SMV సదుపాయం వల్ల టెలికాం కంపెనీ మొబైల్ నెట్‌వర్క్‌ ద్వారా వెరిఫికేషన్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. కొత్త సిమ్ తీసుకున్నప్పుడు, మొబైల్ నంబర్‌ను ధృవీకరించినప్పుడు, యాప్‌లోకి లాగిన్ లేదా రీ-లాగిన్ అయినప్పుడు, అకౌంట్‌ను తిరిగి పున:రుద్దరించినప్పుడు, ఏదైనా ఇతర వెరిఫికేషన్ సమమంలో ఆటోమేటిక్‌గా నెట్ వర్క్ ఆధారంగా ధృవీకరణ పూర్తవుతుందని వొడాఫోన్ ఐడియా తెలిపింది. తొలిసారి మెటాతో కలిసి వీఐ ఈ ఫీచర్ తీసుకొచ్చింది. రానున్న రోజుల్లో మిగతా సంస్థలు కూడా ఇదే తరహా ఫీచర్‌ను తీసుకొచ్చే అవకాశముంది. దీని వల్ల  ఓటీపీల అవసరం ఉండదు. సిగ్నల్ సరిగ్గా లేని ప్రదేశాల్లో ఓటీపీలు అందుకునేందుకు తిప్పలు పడాల్సిందే. ఇప్పుడు అలాంటి కష్టాలు తప్పనున్నాయి.

Follow Us