AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Report: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ మరో అప్డేట్..

నైరుతి రుతుపవనాలు ఇప్పటికే కేరళను తాకగా.. రెండు, మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణలో కూడా విస్తరించనున్నాయి. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రానున్న మూడ్రోజుల పాటు వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి.

Weather Report: నైరుతి రుతుపవనాల ఎఫెక్ట్.. ఏపీ, తెలంగాణకు భారీ వర్షసూచన.. వాతావరణశాఖ మరో అప్డేట్..
Rains
Venkatrao Lella
|

Updated on: Jun 05, 2026 | 4:07 PM

Share

ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో వర్షాలు కురవనున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గోవా మొత్తం, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు కురవనున్నాాయి. ఉత్తర కోస్తా , దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో ఈరోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశం ఉంది.  ఉరుములతొ కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. ఈదురుగాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మూడ్రోజుల పాటు వర్షాలు

రేపు, ఎల్లుండి ఏపీలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. అటు కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాలలో రాబోయే 5 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదులో గణనీయమైన మార్పు లేకుండానే కొంచెం తగ్గే అవకాశముందని అమరావతి వాతావరణశాఖ స్ఫష్టం చేసింది. జూన్ 5 తేదీ  2026 నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి పయనం 14° ఉత్తర అక్షాంశం /60° తూర్పు రేఖాంశం, 13 .5° ఉత్తర అక్షాంశం /65° తూర్పు రేఖాంశం, 13 ° ఉత్తర అక్షాంశం /70° తూర్పు రేఖాంశం, మంగళూరు, ఉతగమండలం, కొడైకెనాల్, తూత్తుకుడి , 8 .8° ఉత్తర అక్షాంశం /79° తూర్పు రేఖాంశం, 11° ఉత్తర అక్షాంశం /83° తూర్పు రేఖాంశం, 14 .5° ఉత్తర అక్షాంశం /87° తూర్పు రేఖాంశం, 17 .5°ఉత్తర అక్షాంశం/90° తూర్పు రేఖాంశం ,20° ఉత్తర అక్షాంశం /93° తూర్పు రేఖాంశం మరియు 22° ఉత్తర అక్షాంశం /95° తూర్పు రేఖాంశం గుండా కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

తెలంగాణలో వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో కూడా రాబోయే మూడ్రోజుల పాటు వానలు పడనున్నాయి. మరాఠ్వాడా నుండి కొంకణ్, గోవా మీదుగా నైరుతి అరేబియా సముద్రం వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి బలహీనపడింది. దక్షిణ తెలంగాణ, దానిని ఆనుకుని ఉన్న తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, యానాం పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈరోజు ఉదయం 05:30 గంటల సమయానికి బలహీనపడింది. దీని ప్రభావంతో ఈరోజు, రేపు,ఎల్లుండి రాష్ట్రంలోని చాలా జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు రానున్న నాలుగు రోజులలో క్రమంగా రెండు నుండి మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు 40 నుండి 50 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది.

ప్రస్తుత వాతావరణ స్థితి

Follow Us