V Hanumantha Rao: కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావకు అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు!
కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హనుమంతరావు అస్వస్థతకు గురయ్యారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. తాజగా మూత్ర పిండాల సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరారు హనుమంతరావు. ప్రస్తుతం ఆయనకు ఖైరతాబాద్ లోని ఏ.ఐ.ఎన్.యూ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వి.హనుమంత రావు శుక్రవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. గత కొన్నాళ్లుగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నంగా.. తాజాగా ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఖైరతాబాద్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఆయన్ను పరీక్షించిన వైద్యులు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సమాచారం.
అయితే ప్రస్తుతం 78ఏళ్ల వయసు ఉన్న ఆయన గత కొన్ని రోజులుగా ఈ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. గతంలోనూ ఇదే సమస్యతో ఆయన హాస్పిటల్‌లో చేరి చికిత్స కూడా తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుడిగా ఉన్న ఆయన రాజకీయాల్లో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటున్నారు. అయితే ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలియడంతో పలువురు కాంగ్రెస్ నేతల.. ఆయనకు ఫోన్ చేసి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
